Iran: ఇరాన్ దేశంలో ఇస్లామిక్ ఎంత కఠినంగా ఉంటాయో అందరికి తెలిసిందే. గతేడాది హిజాబ్ సరిగ్గా ధరించలేదని చెబుతూ ఆ దేశ మోరాలిటీ పోలీసులు మహ్సాఅమిని అనే యువతిని అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆమె చనిపోవడంతో ఇరాన్ వ్యాప్తంగా పెద్ద ఉద్యమమే జరిగింది. ఇరాన్ మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జట్టు కత్తిరించుకుని, హిజాబ్ విసిరేస్తూ నిరసన తెలిపారు. దాదాపుగా గతేడాది చివరి వరకు ఈ అల్లర్లు అలాగే కొనసాగాయి. ప్రభుత్వం ఈ ఉద్యమంలో పాల్గొన్నవారిని గుర్తించి ఉరిశిక్షలతో పాటు తీవ్రమైన శిక్షలను విధించింది.
ఇదిలా ఉంటే తాజాగా హిజాబ్ కు సంబంధించి ఇరాన్ లో మరో ఘటన జరిగింది. ఇద్దరు మహిళలు తమ జట్టును సరిగ్గా కప్పుకోకుండా ఓ షాపుకు రావడంపై ఓ వ్యక్తి వారిని ప్రశ్నిస్తూ షాపులో ఉన్న పెరుగుతో వారి తలపై దాడి చేస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ ఘటన గురువారం ఇరాన్ లో చోటు చేసుకుంది.
مشهد، شاندیز
از صفحه یاسر عرب pic.twitter.com/zstrtACMQD— Mehdi Nakhl Ahmadi (مهدی نخلاحمدی) (@MehdiNakhl) March 31, 2023
Read Also: MI vs RCB: ముగిసిన ముంబై బ్యాటింగ్.. చీల్చిచెండాడిన తిలక్
ఆ తరువాత ఇద్దరు మహిళలను అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. హిజాబ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు అక్కడి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పబ్లిక్ లో అనుచితంగా ప్రవర్తించినందుకు దాడి చేసిన వ్యక్తిని కూడా అధికారులు అరెస్ట్ చేశారు. చట్టానికి లోబడి ఉండేలా దుకాణం యజమానికి నోటీసులు జారీ చేశారు. ఇరాన్ చట్టాల ప్రకారం ఏడు సంవత్సరాలు దాటిని తర్వాత ప్రతీ అమ్మాయి, మహిళ తప్పనిసరిగా హిజాబ్ ధరించాలి.
ఇలా హిజాబ్ లేకుండా కనిపించే మహిళపై కనికరం లేకుండా విచారణ జరుపుతామని ఇరాన్ న్యాయవ్యవస్థ చీఫ్ బెదిరించడం తర్వాత ఈ అరెస్టులు జరిగాయి. హిజాబ్ ధరించని మహిళలు శిక్షించబడతారని ఘోలామ్ హోస్సేన్ మొహాసేనీ ఈజీ హెచ్చరికలు జారీ చేశారు. శనివారం ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కూడా ఇరాన్ మహిళలు హిజాబ్ ను మతపరమైన అవసరంగా ధరించాలని స్పష్టం చేశారు.