నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. స్కూల్‌లో ఫుడ్ పాయిజన్ చాలా తీవ్రమైన అంశమని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. వారంలో కౌంటర్ వేస్తామన్న ప్రభుత్వ న్యాయవాదిపై మండిపడింది
హిందువులు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం నెలకొంది. ఇస్కాన్‌ను పూర్తిగా నిషేధించాలంటూ బంగ్లాదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇస్కాన్ సంస్థ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఢాకా ప్రభుత్వ వర్గాలు చెప్పుకొచ్చాయి.
P. Chidambaram: ఎయిర్‌సెల్- మ్యాక్సిస్ మనీలాండరింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరానికి ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది.
Patnam Narendra Reddy: వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసులో అరెస్టయి చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి కాస్త ఊరట లభించింది.
Bombay High Court: ఏకాభిప్రాయంతో మైనర్ భార్యతో సెక్స్ చేసిన అది అత్యాచారంగానే పరిగణించబడుతుందని బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. అలాంటి చర్యలకు సంబంధించిన చట్టపరమైన రక్షణ చట్టం అంగీకరించదని చెప్పింది. తన భార్యపై అత్యాచారం చేసిన వ్యక్తికి 10 ఏళ్ల శిక్షను సమర్థిస్తూ బాంబే హైకోర్ట్ నాగ్‌పూర్ బెంచ్ వ్యాఖ్యానించింది.
High Court: క్రూరత్వానికి పాల్పడిన కేసులో 20 ఏళ్ల శిక్షను ఎదుర్కొంటున్న కుటుంబానికి బాంబే హైకోర్టు ఊరటనిచ్చింది. క్రూరత్వం, ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తిని, అతడి కుటుంబాన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఔరంగబాద్ బెంచ్ తీర్పు చెప్పింది. తన చనిపోయిన భార్య పట్ల క్రూరత్వానికి పాల్పడ్డాడని ఒక వ్యక్తి అభియోగాలు ఎదుర్కొన్నాడు.
6 హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసుల అక్రమ నిర్బంధాలపై బాధిత కుటుంబ సభ్యులు పిటిషన్లు వేశారు. ఈ క్రమంలో న్యాయస్థానం విచారణ చేపట్టింది. అక్రమంగా నిర్బంధించిన ఆరుగురు ఎక్కడున్నారో చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులకు కోర్టు ఆదేశించింది. లోకేష్ అనే సోషల్ మీడియా ప్రతినిధి హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణలో ఎస్సై జానకి రామయ్య కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో.. ఎస్సై జానకి రామయ్య స్టేట్మెంట్ను న్యాయస్థానం రికార్డు చేసింది.
ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో ఈ రోజు ఏపీ హైకోర్టులో కీలక పిటిషన్లపై విచారణ సాగనుంది.. ముంబై సినీనటి జత్వాని కేసులో ఐపీఎస్ అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణకు రానుంది..