Bangladesh Violence: ఇస్కాన్‌ను నిషేధించాలని బంగ్లాదేశ్ హైకోర్టులో పిటిషన్.. హిందువుల నిరసన
- ఇస్కాన్‌ను నిషేధించాలంటూ బంగ్లాదేశ్ హైకోర్టులో పిటిషన్..
- దేశంలోని శాంతిభద్రతల పరిస్థితిపై నివేదిక కోరిన బంగ్లా హైకోర్టు..
- పరిస్థితులు క్షీణించకుండా చూడాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరిన న్యాయస్థానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Violence: బంగ్లాదేశ్ జాతీయ జెండాను అగౌరవపరిచారనే ఆరోపణలపై ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును ఢాకా ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అక్కడి హిందువులు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం నెలకొంది. ఇస్కాన్‌ను పూర్తిగా నిషేధించాలంటూ బంగ్లాదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇస్కాన్ సంస్థ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఢాకా ప్రభుత్వ వర్గాలు చెప్పుకొచ్చాయి. దేశంలోని శాంతిభద్రతల పరిస్థితిని రేపటి (గురువారం) ఉదయంలోగా నివేదించాలని అటార్నీ జనరల్‌ను హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, అక్కడి పరిస్థితులు క్షీణించకుండా చూడాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని న్యాయస్థానం కోరింది.
Read Also: Game Changer: ‘నానా హైరానా’ సూపర్.. ఇది ‘శంకర్’ రేంజ్ సాంగ్ అంటే!
Also Read
కాగా, ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ గత నెలలో బంగ్లాదేశ్ లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ జాతీయ జెండాను ఉద్దేశించి పలు వివాదాస్పద కామెంట్స్ చేయడంతో.. ఢాకా విమానాశ్రయంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టును వ్యతిరేకిస్తూ పలు హిందూ సంఘాలు తీవ్ర ఆందోళనకు దిగాయి. అయితే, బంగ్లాదేశ్‌లో ఇప్పటికే హిందువులు, మైనార్టీలపై తీవ్రవాద గ్రూపులు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో భారతదేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్‌లో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మైనార్టీలపై దాడులు చేయడం సరికావని.. హిందువులు, మైనార్టీలందరికీ భద్రత కల్పించాలని అక్కడి అధికారులను ఇండియన్ గవర్నమెంట్ కోరింది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్‌ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!