ఫార్ములా ఈ-కార్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ దర్యాప్తు ఆధారంగా కేసు నమోదు చేసింది ఈడీ. ఫార్ములా ఈ-కార్ రేసులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కేసు నమోదు చేశారు. మనీలాండరింగ్, ఫెమా ఉల్లంఘన కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ-కార్ రేసులో ప్రమేయం ఉన్న కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. ECIR నమోదు చేసినట్లు ఈడీ పేర్కొంది.
హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట లభించింది. పదిరోజులు(ఈనెల 30) వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ కేసులో విచారణ జరపాలని ఆదేశించింది. అలాగే.. విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.
హైకోర్టులో కేటీఆర్ కేసు విచారణ కొనసాగుతుంది. ఏసీబీ కేసుపై కేటీఆర్ లంచ్‌మోషన్ పిటిషన్ వేశారు. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటిషన్ వేశారు. కేటీఆర్ తరపున సీనియర్ లాయర్ ఆర్యమా సుందరం వాదనలు వినిపిస్తున్నారు. కేటీఆర్ పై నమోదైన సెక్షన్లు అతనికి వర్తించవని లాయర్ పేర్కొన్నారు. రాజకీయ కుట్రలో భాగంగా కేటీఆర్ పై కేసు నమోదు చేశారంటూ లాయర్ తెలిపారు.
KTR Petition: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఫార్ములా-ఈ రేసు విషయంలో ఏసీబీ కేసును వ్యతిరేకిస్తూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే నాపై కేసు పెట్టారని కేటీఆర్ అన్నారు. ప్రైవేట్ సంస్థ కు లబ్ధి చేకూర్చామని ఎఫ్ఐఆర్లో చెప్పారు, కానీ ప్రైవేట్ సంస్థను నిందితుల జాబితాలో చేర్చలేదన్నారు. ఏసీబీ తో పాటు ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ ను ప్రతివాదిగా చేర్చారు. అగ్రిమెంట్ కు ముందు నిధులు FEO పంపడం ఉలంఘన…
మంచు కుటుంబంలో మొదలైన వివాదం రోజుకో మలుపు తిరుగుతూ సినిమా రేంజ్ యక్ష్ణన్ ని తలపిస్తుంది. నిన్న మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడి చేయడంతో ఈ వ్యవహారం మరింత రచ్చకు దారితీసింది. ఇదిలా ఉండగా మోహన్ బాబు విచారణకు రావాలని రాచకొండ పోలీసులు నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసారు. తనకి పోలీసులు జారీ చేసిన నోటీస్ ని సవాలు చేస్తూ మోహన్ బాబు…
MohanBabu : జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు, మనోజ్ బౌన్సర్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇంటి లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు మనోజ్ అనుచరులు.
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. కోర్టును తప్పుదోవ పట్టించినందుకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెన్నమనేని రమేష్ పిటిషన్ డిస్మిస్ చేసింది. పదిన్నర సంవత్సరాల పాటు హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. విచారణ సందర్భంగా కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి, ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించినట్లు కోర్టు తెలిపింది. రూ.30 లక్షల జరిమానా విధించింది. ఆది శ్రీనివాస్ కు రూ. 25 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. మరో 5 లక్షలు హైకోర్టు లీగల్…
TG High Court: ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం ఎన్కౌంటర్లో మరణించిన ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను ఈరోజు (డిసెంబర్ 3) వరకు ఏటూరునాగారంలోని ఆస్పత్రిలోనే భద్రపర్చాలని పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్‌లోని అన్ని చెరువులపై పర్యవేక్షణ తమదేనని తెలంగాణ హైకోర్టు తెలిపింది. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్లను.. నిర్ధారించేవరకు పూర్తి పర్యవేక్షణ తీసుకుంటామని న్యాయస్థానం పేర్కొంది. డిసెంబర్ 30లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.