విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ రఘురాజుపై వైసీపీ వేసిన అనర్హత పిటిషన్‌పై మండలి ఛైర్మన్ తీసుకున్న అనర్హత వేటును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్తో పాటు ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి తన నివాసంలో సమాలోచనలు జరిపారు.
మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ పిటిషన్ పై హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. అయితే.. నేడు తీర్పు వెలువడుతుందని అనుకున్నప్పటికీ.., తీర్పు వాయిదా పడింది.
హైడ్రామా కమిషనర్ రంగనాథ్‌ను కోర్టుకు హాజరుకావాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. వచ్చే సోమవారం ఉదయం 10:30 గంటలకు హాజరు కావాల్సిందిగా ఆయనకు ఆదేశాలు అందాయి. ఇటీవల అమీన్‌పూర్‌లో హైడ్రా సంస్థ భవనాన్ని కూల్చివేసిన ఘటనపై కోర్టులో ఆందోళనలు వెల్లువెత్తడంతో వ్యాజ్యం ఉన్న భవనాన్ని ఎలా కూల్చివేశారని హైకోర్టు ఆరా తీసింది. హైడ్రా కమిషనర్ వ్యక్తిగతంగా లేదా లిఖితపూర్వకంగా స్పందించాలని కోర్టు ఆదేశించింది. ఈ పరిణామం హైడ్రా చర్యలపై న్యాయస్థానం యొక్క నిశిత పర్యవేక్షణను , చట్ట నియమాన్ని…
Sanjauli Mosque: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లాలో గల సంజౌలీ మసీదు మరోసారి తీవ్ర వివాదానికి దారి తీసేలా కనిపిస్తోంది. మసీదులోకి ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత ప్రవేశించిన తర్వాత ఈ అంశంపై మళ్లీ తీవ్ర దుమారం చెలరేగింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ రోజు ఓ కీలక కేసులో తీర్పు వెలువరించడంతో పాటు.. పలు కీలక పిటిషన్లపై విచారణ చేపట్టనుంది.. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో నేడు తీర్పు ఇవ్వనుంది ఏపీ హైకోర్టు..
సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే ఆదిమూలం డిశ్చార్జ్ అయ్యారు.. ఆ తర్వాత పుత్తూరులోని తన నివాసానికి చేరుకున్నారు.
Big Breaking: గణేష్ నిమజ్జనం అంటే హుస్సేన్ సాగర్ గుర్తుకు వస్తుంది. ప్రతి ఏటా నగరం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చే వినాయకులు హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేస్తుంటారు.