TG High Court: పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు తీర్పు చెప్పింది. అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు ఆదేశించింది.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు న్యాయస్థానంలో ఊరట లభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయనకు గురువారం బిగ్ రిలీఫ్ లభించింది. సీబీఐ దర్యాప్తునకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఆదేశాలను ప్రస్తుత సిద్ధరామయ్య ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
జన్వాద ఫాం హౌస్ పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఓఆర్ఆర్ పరిధిలో హైడ్రా పనిచేస్తుందని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల పరిరక్షణ హైడ్రా విధి అని పేర్కొన్నారు.
Supreme Court: రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. జనరల్ కేటగిరీ సీట్లలో రిజర్వేషన్ల ప్రయోజనం పొందుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వకూడదని ఆదేశించిన మధ్యప్రదేశ్ హైకోర్టు నిర్ణయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఇతర వెనుకబడిన తరగతి (ఓబీసీ), షెడ్యూల్డ్ కులం (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) కేటగిరీలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు తమ మెరిట్ ఆధారంగా జనరల్ కోటా సీట్లలో అడ్మిషన్ పొందేందుకు అర్హులు అని సుప్రీంకోర్టు తన తీర్పులో…
Kolkata Rape Case: దేశంలోనే సంచలనం సృష్టిస్తోంది కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో జరిగిన ట్రైనీ డాక్టర్ హత్యా కేసు. ఇక ఇందుకు సంబంధించి మంగళవారం (ఆగష్టు 20)న సుప్రీం కోర్టులో కలకత్తా డాక్టర్ హత్యాచార ఘటన పై విచారణ జరగనుంది. ఇప్పటికే కలకత్తా డాక్టర్ హత్యాచార ఘటనను సుమోటోగా కేసు స్వీకరించింది సుప్రీం కోర్ట్. ఇక మరోవైపు డాక్టర్ హత్యచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అలాగే ఘటనపై సీబిఐ విచారణ కూడా జరుగుతుంది.…
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనను మంగళవారం హైకోర్టు సీబీఐకి అప్పగించింది. దీంతో దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. హత్యాచార ఘటనపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇదిలా ఉంటే బుధవారం ఢిల్లీ నుంచి కోల్‌కతాకు ప్రత్యేక వైద్య మరియు ఫోరెన్సిక్ బృందం రానుంది. ఉదయాన్నే బయల్దేరి కోల్‌కతా చేరుకోనుంది. తొలుత ఆర్‌జీ కర్ ఆస్పత్రిని సందర్శించి దర్యాప్తు చేపట్టనున్నారు.
మధురలోని శ్రీ కృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆర్డర్ 7 రూల్ 11పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముస్లిం పక్షం దఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది.
మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. షాహి ఈద్గా మసీదు భూమి హిందువులదేనని, అక్కడ పూజలు చేసుకునే హక్కు కల్పించాలని హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొంది.
ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేత్రుత్వంలోని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.