జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమనిర్మాణాలపై హైకోర్టు విచారణ జరిపింది. కోర్టు స్టేలు ఎత్తివేయాలని జీహెచ్ఎంసీ ఎందుకు కోరడం లేదన్న హైకోర్టు… అక్రమ నిర్మాణం పూర్తయ్యే వరకు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. జీహెచ్ఎంసీలోనే సుమారు లక్ష అక్రమ నిర్మాణాలున్నాయన్న హైకోర్టు… రాష్ట్రవ్యాప్తంగా అక్రమ నిర్మాణాల పరిస్థితి ఏమిటని కాగితాల్లో నిబంధనలు బాగున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాలపై తీసుకున్న చర్యలు నివేదించని జోనల్ కమిషనర్లపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నివేదికలు సమర్పించని అధికారులు ఖర్చుల కింద రూ.10వేలు చెల్లించాలని హైకోర్టు తెలిపింది. రెండు వారాల్లో నివేదికలు సమర్పించాలని చివరి అవకాశం ఇచ్చిన హైకోర్టు… అక్రమ నిర్మాణాలపై విచారణ ఈనెల 25కి వాయిదా వేసింది.