ఓయూ భూములు కబ్జా అవుతున్నాయన్న లేఖపై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ జరిపింది. ఓయూ విద్యార్థి పి.రమణారావు లేఖపై హైకోర్టు విచారణకు కోరారు. సుమారు 3వేల గజాలకు పైగా భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసి ఆక్రమిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. కబ్జాకు కాకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపిన ఏజీ… తులసి హౌజింగ్ సొసైటీపై పోలీసులకు ఓయూ ఫిర్యాదు చేసిందని తెలిపారు. దర్యాప్తు ఏ స్థాయిలో ఉందో నివేదిక సమర్పించాలని హైకోర్టు అదహేశాలు జారీ చేసింది. హైదరాబాద్ సీపీ, అంబర్ పేట పోలీసులను ప్రవాదులుగా చేర్చిన హైకోర్టు తదుపరి విచారణ అక్టోబరు20కి వాయిదా వేసింది.