తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం.. ఇక ప్రత్యక్ష విచారణ.. కానీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి కారణంగా కోర్టులు కూడా ఆన్లైన్ విచారణకే పరిమితం అయ్యాయి… కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో.. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్ష విచారణకు సిద్ధం అవుతోంది తెలంగాణ హైకోర్టు.. ఆగస్టు 9వ తేదీ నుంచి పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయించింది.. ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 9 వరకు పాక్షికంగా కేసుల ప్రత్యక్ష విచారణ జరగనుండగా.. రోజూ ఒక ధర్మాసనం, ఒక సింగిల్ బెంచ్ ప్రత్యక్ష విచారణ జరుపుతుందని.. వ్యాక్సిన్ వేసుకున్న న్యాయవాదులకే ప్రత్యక్ష విచారణకు అనుమతి ఇవ్వనున్నట్టు హైకోర్టు తెలిపింది.. కేసు ఉన్న న్యాయవాదులు మాత్రమే విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. దీంతో.. హైకోర్టులో ఆగస్టు 8వ తేదీ వరకు ఆన్ లైన్ లోనే విచారణ కొనసాగనుంది.
మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా కోర్టులు, ట్రిబ్యునళ్లకు మార్గదర్శకాలు జారీ చేసింది హైకోర్టు.. కోర్టులు, ట్రిబ్యునళ్లలో సెప్టెంబరు 9వరకు పాక్షిక ప్రత్యక్ష విచారణలు కొనసాగించాలని.. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఆగస్టు 8వరకు ఆన్ లైన్ లోనే కేసుల విచారణ జరగాలని.. టీకా వేసుకున్న న్యాయవాదులకే కోర్టులోకి అనుమతి ఉంటుందని పేర్కొంది. న్యాయవాదులు, సిబ్బంది కోవిడ్ నిబంధనలు తప్పనిసరి పాటించాలని స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు.
Also Read
- Harish Rao : కేసీఆర్ పాలనలో పరిష్కారాలు.. రేవంత్ సర్కార్‌లో సమస్యలే
- Sabita Indra Reddy: చీర లాగారు.. కింద పడేసి తొక్కారు.. జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశాం..
- IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
- High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
తాజావార్తలు
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
-
Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?