మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది.. తాజాగా మరోసారి అశోక్ గజపతిరాజుకు అనుకూలంగా తీర్పు వచ్చింది.. దీనిపై మీడియాతో మాట్లాడిన ఆయన.. మాన్సాన్ ట్రస్ట్ విషయంలో నా నియామకంపై హైకోర్టు మరోసారి అనుకూలంగా ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు తెలిపారు.. వరసగా ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగిలినా బుద్ది రావడంలేదని మండిపడ్డారు.. కోర్టులో ప్రభుత్వానికి ప్రతిసారి చుక్కెదురవ్వడంపై ఆలోచించుకోవాలని సూచించిన ఆయన.. ఎక్కడ లేని విధంగా ప్రభుత్వం మాన్సాస్ వ్యవహారంలో తలదూర్చిందన్నారు.. ఇష్టానుసారంగా నియామకాలు చేసి ట్రస్ట్ ని డ్యామేజ్ చేశారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. హైకోర్టు చెప్పినా కూడా ఇప్పటివరకు ఈవో నన్ను కలవలేదన్నారు.. నేను ఇచ్చిన ఆదేశాలు పట్టించుకోవడం లేదు.. నేను అడిగిన వివరాలు కరెక్ట్‌గా ఇవ్వలేదు.. ప్రభుత్వం అడ్డుగోలు వ్యవహారాలు చేస్తూ, దేవాలయాలను డ్యామేజ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సింహాచలంలో సీతారాములు కోవెలలో కూలిన ధ్వజస్తంభం పై వివరాలు కోసం రిపోర్ట్ అడుగుతాను అన్నారు అశోక్‌గజపతిరాజు.. దేవాలయాలపై రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఆచారాలకు విరుద్ధంగా నియమాలు మార్చారని ఆరోపించారు.. దేవాలయాలు పై దాడులు చేసిన పట్టించుకోలేదు.. డబ్బులు వచ్చే దేవాలయాలపై పెత్తనం చెలాయించడానికి ప్రభుత్వం చూస్తోందని.. దేవాలయాల ఆస్తులు కాజేయాలని చూస్తోందని మండిపడ్డారు. ఇక, హిందూమతం మీద దాడి చేస్తున్నారని విమర్శించిన అశోక్ గజపతిరాజు.. దేవాదాయశాఖ పూర్తిగా సక్రమంగా నడవడం లేదన్నారు. మరోవైపు.. జాయింట్ కలెక్టర్లకు ఆ శాఖ బాధ్యతలు అప్పజెప్పడం సరికాదన్న ఆయన.. దీనివల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయన్నారు.. దేవుడు మీద నమ్మకం లేనివల్లే ఇలాంటి పనులు చేస్తారని.. మాజీ చైర్మన్ ఉద్ధరించిది తక్కువ, అలజడి సృష్టించింది ఎక్కువ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చైర్మన్ సీటు కోసం చేసిన పోరాటం.. ట్రస్ట్‌ని బాగుచేయడం మీద లేదంటూ సెటైర్లు వేశారు అశోక్ గజపతిరాజు.. నా తర్వాత ఇంకా అబ్బాయిలు ఎవరు లేరు.. నేను చనిపోయేంతవరకు కూడా ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. ఛైర్మన్ సీటు కోసం అన్ని రకాలుగా ప్రయత్నలు చేస్తున్నారు… సంచయిత గజపతిరాజు.. ఆవిడ కోసం కొన్న రెండు కార్లు ఇంతవరకు అప్పజెప్పారో లేదో ఈవో చెప్పలేదన్నారు.. సిబ్బందికి జీతాలు ఇవ్వడం కోసం డబ్బులు లేవు అని చెప్పిన సంచయిత.. కోటి రూపాయలు పెట్టి రెండు కార్లు ఎలా కొన్నారని ప్రశ్నించారు.. ఏదో ఒక రోజు ఇవి అన్నీ బయటకు వస్తాయి.. మర్చిపోవద్దు అని హెచ్చరించారు.. ట్రస్ట్ బోర్డ్ వివరాలు ఇంతవరకు అడిగితే ఇవ్వలేదన్న ఆయన.. ఆడిట్ కోసం అడిగిన ప్రతిసారి మా దగ్గర స్టాఫ్ కొరత అని చెప్పారు.. కానీ, ఇప్పుడు అన్ని ఏళ్లు ఆడిట్ పెండింగ్ అని చెపుతున్నారని మండిపడ్డారు.. ఆడిట్ ని పెద్ద బూచి లాగా ప్రభుత్వం బయటకి చూపిస్తోందని విమర్శించారు. జనాల్ని మభ్యపెట్టడానికి విశ్వప్రయత్నాలు ప్రభుత్వం చేస్తోందని.. మాన్సాన్ ట్రస్ట్ ప్రభుత్వానికి కోట్ల రూపాయలు ట్యాక్స్‌గా కడుతుంటే.. మా మీద పెత్తనం చేయాలని చూస్తోందని అసహనం వ్యక్తం చేశారు.