చెన్నమనేని పౌరసత్వ వివాదం కేసు.. హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నమనేని పౌరసత్వ వివాదం కేసులో విచారణ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు.. ఇవాళ్టి హైకోర్టు విచారణకు కేంద్ర ప్రభుత్వం తరపున అస్సిటెంట్ సోలిసిటర్ జనరల్ రాజేశ్వర్ రావు హాజరయ్యారు.. ఇదే సమయంలో… బుక్ లెట్ రూపంలో కోర్టుకు నివేదిక సమర్పించారు పిటిషనర్ ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది రవికిరణ్ రావు… 2019 వోసీఐ కార్డ్ బెర్లిన్ లో ఇండియన్ అంబసి ద్వారా చెన్నమనేని తీసుకున్నాడని కోర్టుకు వివరించారు.. వోసీఐ దరఖాస్తు ఫామ్ 10 కాలంలో నేషనాలిటీ జర్మనీ అని పెట్టాడని కోర్టుకు తెలియజేశారు.. చెన్నమనేని రమేష్ బాబు.. వోసీఐ కార్డ్ మీద ఇండియాకు వచ్చి జర్మనీ పాస్‌పోర్ట్ మీద జర్మనీకి వెళ్తున్నట్టు తెలిపారు.
ఇక, 2009 భారత దేశ పౌరసత్వం పొందినప్పుడు 2013 వరకు జర్మనీ పాస్ పోర్ట్ కాలపరిమితి ఉండే.. అతను భారతీయుడు అయితే 2013లో జర్మనీ పాస్ పోర్ట్ ను 2023 వరకు ఎలా రెన్యూవల్ చేసుకుంటాడని వాదనలు వినిపించారు రవికిరణ్… ఇండియన్ అయితే ఇండియా పాస్ పోర్ట్ మీదనే ప్రయాణం చేయాలి.. కానీ, జర్మనీ పాస్ పోర్ట్ మీదనే ప్రయాణాలు చేస్తున్నాడని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు.. అయితే, మీ వోసీఐ కార్డులోనే జర్మనీ నేషనలిటీ అని ఎలా రాశారని ప్రశ్నించింది హైకోర్టు.. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ.. ఎన్నికలకు సిద్ధం కావాలని పేర్కొంది హైకోర్టు.. కాగా, తమ పిటిషనర్ చెన్నమనేనితో సంప్రదించి పూర్తి వాదనలు వినిపిస్తాయని చెన్నమనేని తరపు న్యాయవాది తెలపడంతో.. తదుపరి విచారణను ఆగస్టు 24వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!