కోకాపేట్, ఖానామెట్ భూముల వేలానికి అనూహ్య స్పందన వచ్చింది.. కనక వర్షమే కురిసింది.. అయితే, ఖానామెట్ భూముల వేలంపై కీలక ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు.. ఖానామెట్‌లోని మూడెకరాల స్మశాన వాటిక వేలాన్ని ఆపాలని హైకోర్టు ఆదేశించింది. ఖనామెట్‌లో గొల్డెన్ మైల్‌లోని 15 ఎకరాలను వేలం వేశారు.. అయితే, 15 ఎకరాల్లో మూడెకరాల స్మశానం కూడా ఉంది. ఆ స్మశాన స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం వేలానికి పెట్టగా.. ఆ స్మశానవాటిక వేలాన్ని ఆపాలంటూ హైకోర్టును ఆశ్రయించారు స్థానికులు……
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమరావతి భూముల ఇన్‌సైడ్‌ట్రేడిరగ్ జరిగిందనే ఆరోపణలను కోర్టులు కొట్టివేశాయనే ప్రచారం జరుగుతున్నా వాస్తవంలో అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటిపై దాఖలైన ఎఫ్‌ఐఆర్ వాజ్యం సాక్షాత్తూ అత్యున్నత న్యాయస్థానంలోనే తేలవలసి వుంది. జులై 13న సుప్రీం కోర్టులో జస్టిస్ వినీత్ శరణ్, దినేశ్ మహేశ్వరితో కూడిన ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు ఆసక్తికరమైన చర్చ జరిగింది. కేసు మంచి చెడ్డలతోపాటు ఎక్కడ విచారణ జరగాలనేదానిపైనా…
ఓవైపు ప్రభుత్వ భూముల వేలానికి ప్రభుత్వం సిద్ధమవుతోన్న తరుణంలో.. మరోవైపు.. ఆ భూములు ఎవరూ కొనవద్దు.. హైకోర్టు విచారణ పూర్తి అయ్యేవరకు ఆగాలని సూచిస్తున్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి.. రేపటి కోకాపేట, ఖానామెట్ భూముల వేలం ఆపేందుకు హైకోర్టు నిరాకరించడంతో భూముల వేలానికి మార్గం సుగమం కాగా.. కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్ లో 14.92 ఎకరాల భూముల వేలానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అయితే, భూముల అమ్మకం విషయంలో ప్రభుత్వానికి హై కోర్టు మొట్టికాయలు…
కరోనా మహమ్మారి ఎఫెక్ట్ కోర్టులపై కూడా పడింది.. ఆన్‌లైన్ పిటిషన్లు మాత్రమే స్వీకరించడం.. వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా విచారణ చేయడం లాంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అయితే, కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. క్రమంగా అన్ని తెరుచుకుంటున్నాయి.. ఈ తరునంలో.. కోర్టుల్లో అన్ లాక్ ప్రారంభించాలని నిర్ణయించింది హైకోర్టు.. సిబ్బంది అందరూ విధులకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేసింది.. ఇప్పటి వరకు రోజు విడిచి రోజు సగం మంది సిబ్బంది హాజరవుతుండగా.. ఈనెల 19 నుంచి…
ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ వివాదంపై హైకోర్టు విచారణ జరిపింది. సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేసింది. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై ఏ నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు… హెరిటేజ్ భవనం మినహా మిగతా బ్లాక్ లలో నిర్మించలేరా అని ప్రశ్నించింది. ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలిస్తోందని తెలిపిన ఏజీ ప్రసాద్… నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎన్నేళ్లు కావాలని… ప్రభుత్వం తీరు…
కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా.. ఇప్పుడు రైతుల కూడా ఎంట్రీ ఇచ్చారు.. కృష్ణాజలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వ ఉల్లంఘనలకు పాల్పడుతుందంటూ తెలంగాణ హైకోర్టుకెక్కారు ఏపీ రైతులు.. కృష్ణా జిల్లాకు చెందిన రైతులు గూడవల్లి శివరామ కృష్ణ ప్రసాద్, ఎమ్. వెంకటప్పయ్య హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.. కేంద్ర జలవనరులశాఖ, కేఆర్ఎంబీ, తెలంగాణ జెన్ కో, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, ఏపీ ఇరిగేషన్ శాఖలను ప్రతివాదులుగా…
ఆంధ్రప్రదేశ్‌లోని మండల పరిషత్, జిల్లా పరిషతుల్లో ప్రత్యేక అధికారుల పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగించింది ప్రభుత్వం… గతంలో ప్రకటించిన ప్రత్యేక అధికారుల పాలన ఈ నెల 4వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో.. మరో ఆరు నెలల ప్రత్యేక పాలన కొనసాగుతుందంటూ వెల్లడించింది ఏపీ సర్కార్.. ఏప్రిల్ 8న మండల, జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు పూర్తయినప్పటికీ, హైకోర్టు ఆదేశం కారణంగా ఓట్ల లెక్కింపు చేపట్టలేదు. తాజాగా తదుపరి విచారణను జూలై 27వ తేదీకి వాయిదా వేసింది…
అడ్డగూడూరు లాకప్ డెత్ పై నేడు మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది. 5 కోట్లు నష్టపరిహరం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు పిటీషనర్ జయవింధ్యాల. నేడు ఈ ఘటన పై పూర్తి నివేదిక హైకోర్టు కు సమర్పించునుంది ప్రభుత్వం. ప్రస్తుతం ఈ కస్టోడియల్ డేత్ పై జ్యుడీషియల్ దర్యాప్తు కొనసాగుతుంది. అవసరమైతే రీ పోస్ట్ మార్టం చేయాలనీ న్యాయస్థానం సూచించింది. కానీ మరియమ్మకు పోలీసులు రీ పోస్ట్ మార్టం చేయలేదు. ఈ ఘటనలో ఇప్పటికే ఒక…
అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకోర్టు.. ఇవాళ హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ జరగగా.. విజయవాడ లబ్బీపేటలోని అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి ఆమోదం తెలిపింది కోర్టు.. ఎస్బీఐ వేలంలో 1401 చదరపు గజాల భూమిని రూ.22.45 కోట్లకు విజన్ ఎస్టేట్స్ దక్కించుకోగా.. అగ్రిగోల్డ్ కు విజన్ ఎస్టేట్స్ బినామీ కాదని హైకోర్టుకు తెలిపింది ఏపీ సీఐడీ.. వాస్తవ మార్కెట్ ధరకన్నా విజన్ ఎస్టేట్ తక్కువకు కోట్ చేసిందని పేర్కొంది సీఐడీ.. అయితే, వాస్తవ ధర…