టీటీడీ పాలకమండలిపై విమర్శల వెల్లువ : హైకోర్టులో పిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీటీడీ బోర్డుపై అభ్యంతరాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాలు గళం ఎత్తగా….బీజేపీ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. మరోవైపు హైకోర్టులో టీటీడీపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఏపి ప్రభుత్వం నియమించిన జంబో టీటీడీ పాలకమండలి వ్యవహారంలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. 81 మందితో పాలకమండలి ఏర్పాటును వివిధ రాజకీయ పార్టీలు తప్పుబడుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖరాశారు. 50 మందికి ఎక్స్ ఆఫిషియోగా అవకాశం ఇచ్చి బోర్డులో పెట్టడాన్ని తప్పుబట్టారు. ఇతర రాజకీయ పక్షాలు కూడా దీనిపై గళమెత్తాయి.
బీజేపీ మరో అడుగు ముందుకేసి గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. నేరస్తులకు అవకాశం ఇవ్వడం ద్వారా పవిత్రత దెబ్బ తింటుందని సోము వీర్రాజు వ్యాఖ్యనించారు. సామాన్య భక్తులకు ఈ బోర్డు వల్ల ఇబ్బందులు వస్తాయని అభిప్రాయపడ్డారు. టీటీడీపై అభ్యంతరాలతో హైకోర్ట్ లో పిల్ నమోదైంది. దీనిపై ఇవాళ విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. కళ్యాణదుర్గంకు చెందిన టిడిపి నేత ఉమా మహేశ్వర నాయుడు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఎండోమెంట్ యాక్ట్ కు విరుద్దంగా బోర్డు ఉందని పిల్ లో పేర్కొన్నారు. ఇప్పటికే పిల్ ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. అటు రాజకీయ పక్షాలను కానీ ఇటు వివిధ వర్గాల నుంచి వస్తున్న అభ్యంతరాలను కానీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడంలేదు. ఇప్పుడు కోర్టు కేసుతో ఎలాంటి తీర్పు వస్తుందోనని అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
- CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
- Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
- YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
తాజావార్తలు
-
Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
-
ఇండియాలో అడుగుపెడుతున్న Apple Pay .. ఫోన్‌పే, జీపేల కథ ఏంటి ?
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!