గత కొన్ని రోజులు ఏపీలో సినిమా టికెట్ల ధరల చుట్టూ చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడ ప్రభుత్వం టికెట్ల ధరను తగ్గించడం మాత్రమే కాకుండా బెనిఫిట్ షో లను రద్దు చేస్తూ కేవలం రోజుకు నాలుగు షోలు మాత్రమే వేయాలని స్పష్టం చేసింది. అలాగే టికెట్లు కూడా ఆన్లైన్ లో విక్రయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక తాజాగా టికెట్ల ధరలు పెంచేందుకు థియేటర్లకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. కానీ ఇది ఏపీలో కాదు.. తెలంగాణలో. తాజాగా…
మరియమ్మ లాకప్ డెత్ కేసులో తెలంగాణ హై కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మరియమ్మ మృతి పై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని స్పష్టం చేసింది హై కోర్టు. రాష్ట్ర పోలీసుల దర్యాప్తు సరైన రీతిలోనే.. జరుగుతోందని.. ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. మరియమ్మ కస్టోడియల్ మృతి పై విచారణ ముగించిన హై కోర్టు.. ఈ కేసులో తార్కిక ముగింపు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అభిప్రాయపడింది. మరియమ్మ కస్టోడియల్ మృతి పై ప్రస్తుత దశలో ఎలాంటి చర్యలు అవసరం…
మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులను ఏపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఇప్పటికే హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ తెలిపారు. ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఏపీ కేబినెట్ అత్యవసరంగా సమావేశమైందని… ఈ సమావేశంలో మూడు రాజధానులపై తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుందని కోర్టుకు విన్నవించారు. అయితే, రాజధాని కేసులపై సోమవారం విచారణ చేపట్టనుంది హైకోర్టు ధర్మాసనం. Read Also: కలవరపెడుతోన్న కోవిడ్ కొత్త…
సాధారణంగా బయట ఏ4 సైజు పేపర్‌ను వాడితే.. కోర్టులు, రిజిస్ట్రేషన్ కార్యాలయలు.. ఇతర కొన్ని ప్రభుత్వ ఆఫీసుల్లోనూ ఏ4 కంటే కాస్త పొడవైన పేపర్లు వాడుతుంటారు.. అయితే, హైకోర్టులో ఏ4 సైజు పేపర్‌ను ఉపయోగించడంపై బాంబే హైకోర్టులో విచారణ జరిగింది.. తెలంగాణ హైకోర్టు మరియు అన్ని సబార్డినేట్ కోర్టులలో అన్ని న్యాయపరమైన ప్రయోజనాల కోసం రెండు వైపులా రాసిన ఏ4 సైజు పేపర్లను మాత్రమే ఉపయోగించాలంటూ మయూర్ ముంద్రా అనే న్యాయవాది రిట్ పిటిషన్ దాఖలు చేశారు..…
బాటసింగారం, గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ సమస్యపై అడ్వకేట్ కమిషనర్‌ను నియమించింది తెలంగాణ హైకోర్టు.. ఆ రెండు ఫ్రూట్ మార్కెట్లను సందర్శించాలని అడ్వకేట్ కమిషనర్‌ను ఆదేశించింది.. ఫ్రూట్ మార్కెట్ ను సందర్శించి నివేదికను నవంబర్ 19లోగా హైకోర్టు సమర్పించాలని పేర్కొంది.. అయితే, హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్ తరఫు న్యాయవాది.. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ బలవంతంగా గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ ను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారని కోర్టుకు విన్నవించారు.. ఇక, ప్రభుత్వం…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా ఏజీ బిఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో హైకోర్టు ప్రాంగణంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ,ఇతర న్యాయమూర్తులు ఏజీ బిఎస్ ప్రసాద్,అడిషనల్ ఏ జి జె.రామచందర్ రావు, కలిసి మొక్కలు నాటారు ఎంపీ…
భర్త ఇంటికి రావడంలేదని చెప్పి ఓ మహిళ మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ కేసు దాఖలు చేసింది. సెప్టెంబర్ 15 వ తేదీ నుంచి కనిపించడంలేదని కేసులో పేర్కొన్నది. ఈ కేసును స్వీకరించిన హైకోర్టు ఆమె భర్తను వెతికి కోర్టులు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తును వేగంగా ముగించారు. దర్యాప్తు నివేదికను కోర్టుకు సమర్పించారు. పోలీసుల నివేదికను చూపి హైకోర్టు షాక్ అయింది. Read: నేటి నుంచి శబరిమల ఆలయంలోకి భక్తుల…
తెలంగాణలో పోడు భూముల వ్యవహారం సుదీర్ఘ కాలంగా కొనసాగుతూనే ఉంది.. ఇప్పుడు ఈ వ్యవహారంలో హైకోర్టుకు చేరింది.. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పోడు భూములపై హైకోర్టులో విచారణ జరిగింది.. వేలాది మంది ఆదివాసులను అడవి నుండి వెల్ల గొట్టడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. చెరుకు సుధాకర్, పిల్ విశ్వేశ్వర్ రావు, అది వాసి పోరాట సమితి నేత శ్రవణ్.. విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు వాదనలు వినిపించారు చిక్కుడు ప్రభాకర్.. ఈ పిటిషన్…
మద్యం షాపుల కేటాయింపుల్లోనూ రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.. గౌడ్, ఎస్సీ, ఎస్టీలకు షాపుల కేటాయింపుల్లో రిజర్వేషన్లు కల్పించింది.. అయితే, మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. ఖమ్మం జిల్లాకు చెందిన రవికాంత్ ఈ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ పిటిషన్ వేయగా.. హైకోర్టు అత్యవసర విచారణకు స్వీకరించింది.. కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఉందన్న తన పిటిషన్లో పేర్కొన్నారు పిటిషనర్.. అయితే, ఈ కేసుపై విచారణ చేపట్టిన తెలంగాణ…