Jharkhand Assembly: దేశ చరిత్రలో ఓ ముఖ్యమంత్రిని అరెస్టు చేసిన చీకటి రోజుగా జనవరి 31 మిగిలిపోతుందని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు. జార్ఖండ్ అసెంబ్లీ సమావేశాలలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. గిరిజనులు, వెనుకబడిన తరగతుల ప్రజల కన్నీళ్లు పట్టించుకోనందున తాను ఈ రోజు కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పాడిందని అన్నారు. చంపై సోరెన్‌కు జేఎంఎం నేతృత్వంలోని కూటమికి పూర్తి మద్దతు ఉందన్నారు. తన అరెస్టుపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ హేమంత్ సోరెస్ విమర్శలు గుప్పించారు.
Read Also: MLA Vasantha Krishna Prasad: పని చేస్తే వైసీపీ నుంచే పని చేస్తానని చెప్పా..
అయితే, కోట్లాది రూపాయలు దోచుకుని విదేశాలకు పారిపోయే వారిపై కేంద్ర సంస్థలు ఏమీ చేయలేవని హేమంత్ సోరెన్ ఆరోపించారు. బీజేపీ కేవలం గిరిజనులు, అమాయకులను లక్ష్యంగా చేసుకోను ఈ దాడులు చేస్తుందన్నాడు. తన అరెస్ట్ లో రాజ్ భవన్ పాత్ర కూడా ఉందన్నారు. ఆరోపణలు చేస్తున్న 8.5 ఎకరాల స్థలం తన పేరు మీద నమోదైందంటే రుజువు చేయాలని బీజేపీకి ఆయన సవాల్ విసిరారు. నా పేరు మీద ఆ భూమి ఉండే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. ఆదివాసీల కన్నీళ్లు మీకు పట్టవు కాబట్టి నేను ఏడవను.. సరైన సమయంలో వారి కుట్రలన్నింటికీ సమాధానం చెబుతాను అని మాజీ సీఎం హేమంత్ సోరెన్ తీవ్ర ఆవేదన చెందుతూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read Also: Shreyas Iyer: బ్యాట్‌తో విఫలమైనా.. ఫీల్డింగ్‌లో అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్!
ఇక, జార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా కోర్టు ప్రత్యేక అనుమతితో హేమంత్ సోరెన్ ఇవాళ ఉదయం జార్ఖండ్ అసెంబ్లీకి చేరుకున్నారు. ఈడీ అధికారులు, పోలీసుల ప్రత్యేక భద్రత మధ్య ఆయన అసెంబ్లీకి వచ్చారు. అయితే, రెండు రోజుల అసెంబ్లీ సమావేశాలలో తొలి రోజు సమావేశాలను ప్రారంభిస్తూ గవర్నర్ ప్రసంగించారు. లాండ్ స్కామ్ లో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమంత్ సోరెన్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దీంతో సీఎం పదవికి హేమంత్ రాజీనామా చేశారు. ఆ తర్వాత జేఎంఎం కూటమి శాసనసభా పక్షనేతగా చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని చంపై సర్కారును ఆదేశించారు. కాగా, ఇవాళ అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ లో అధికార పార్టీ కూటమి 47 ఓట్లతో బలపరీక్ష గెలిచింది.
#WATCH | Former Jharkhand CM and JMM leader Hemant Soren says, "Main aansu nahi bahaunga, aansu waqt ke liye rakhuga, aap logo ke liye aansu ka koi matlab nahi…" pic.twitter.com/y1dOU0f7td
— ANI (@ANI) February 5, 2024