బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాను త్వరలో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున తమిళనాడులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం తీరం వైపు దూసుకొస్తుంది.. దక్షిణ అండమాన్‌లో ఉన్న అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా పయనించి నిన్న ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా, సాయంత్రానికి వాయుగుండంగా మారిపోయింది.. ఇవాళ సాయంత్రానికి తుఫాన్‌గా మారుతుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.. పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి రేపు ఉదయం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాల్లో తీరం దిశగా రాబోతోంది.. ఆ తర్వాత పశ్చిమ వాయువ్యంగానే పయనిస్తూ ఈనెల 9వ తేదీ రాత్రి లేదా 10న…
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో నేడు, రేపు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో వాతావరణం పొడిగా మారిపోయింది. మరో రెండు నుంచి మూడు రోజులు వాతావరణంలో ఏ మార్పులు ఉండవని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. భారీ వర్షాలకు చెన్నై నగరం నిండుకుండలా మారింది. చెన్నై, కడలూరు, కాంచీపురం, మధురై, కన్యాకుమారి సహా పలు జిల్లాల్లో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి.
తమిళనాడులోని చెన్నై, కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువళ్లూరు జిల్లాలతో సహా ఎనిమిది జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. డెల్టా జిల్లాలైన తంజావూరు, తిరువారూర్ నాగపట్నంలలో కళాశాలలు కూడా మూసివేయబడ్డాయి.
బంగ్లాదేశ్‌లో సిత్రాంగ్ తుఫాన్ విళయతాండవం చేస్తోంది. సోమవారం రాత్రి బంగ్లాదేశ్‌లోని బరిసాల్ సమీపంలోని టింకోనా ద్వీపం, శాండ్‌విప్ మధ్య సిత్రాంగ్ తీరాన్ని దాటిన తర్వాత పశ్చిమ బెంగాల్ తీరాన్ని దాటుకుని బంగ్లాదేశ్ తీరాన్ని దాటింది. సిత్రాంగ్ తుఫాన్ కారణంగా దాదాపు 35 మంది చనిపోయారు.