New Idea: భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడటం సాధారణ విషయమే. వర్షం వస్తే ఇంటా, బయట ఏ పని పూర్తి కాదు. వర్షాలు, తుఫాన్లు వస్తున్నా అత్యవసర రంగాలకు చెందిన ఉద్యోగులు పలు జాగ్రత్తలతో పనిచేయాల్సి ఉంటుంది. తుఫాన్ కారణంగా అమెరికాలోని ఫ్లోరిడా నగరం అల్లకల్లోలంగా మారింది. నాలుగు రోజులుగా ఫ్లోరిడాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సందర్భంగా జోరు వానలో, భీకర గాలిలోనూ అక్కడి పరిస్థితులను వివరించేందుకు కైలా అనే మహిళా రిపోర్టర్ ప్రయత్నించింది. వర్షంలో మైక్ తడిచే అవకాశం ఉండటంతో ఆమె వినూత్నంగా ఆలోచించింది. తన దగ్గర ఉన్న మైక్‌కు ఓ కండోమ్ తొడిగింది. దీంతో ఆమె మైక్‌కు కండోమ్ తొడిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read Also: Acid In Water Bottle: వాటర్ బాటిల్‌లో యాసిడ్.. రెస్టారెంట్ క్లోజ్డ్
సాధారణంగా మైక్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తడవకుండా ప్లాస్టిక్ కవర్లు వాడుతుండటం మన ఇండియాలో చూస్తుంటాం. కానీ మహిళ కండోమ్ వాడటంతో పలువురు అవాక్కవుతున్నారు. ఈ ఫోటోలను చూసిన నెటిజన్‌లు సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. కండోమ్‌ను ఇలా కూడా వాడొచ్చా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కొందరు నెటిజన్‌లు అయితే మహిళా రిపోర్టర్ దగ్గర ఆ సమయంలో కండోమ్ ఎందుకు ఉంది అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే మైక్‌కు కండోమ్ తొడగడంపై మహిళా రిపోర్టర్ స్పందించింది. ‘అవును ఇది కండోమ్.. ఇక్కడ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రిపోర్టింగ్ చేసే సమయంలో మైక్రోఫోన్ తడవకుండా ఉండేందుకు ఈ ప్రయత్నం చేశా’ అంటూ కైలా వివరించింది.
There’s resourceful, and then there’s RESOURCEFUL: NBC2’s Kyla Galer went viral on Wednesday for using a condom to keep her microphone dry while reporting on the ground in Ft. Myers, FL, during Hurricane Ian. pic.twitter.com/V8fZvPZ1oR
— NowThis (@nowthisnews) October 2, 2022