Cyclone Mandous: దూసుకొస్తున్న మాండూస్ తుఫాను.. తమిళనాడులో రెస్క్యూ బృందాలు మోహరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Mandous: బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాను త్వరలో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున తమిళనాడులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కావేరి డెల్టా ప్రాంతంలోని నాగపట్నం, తంజావూరు, చెన్నై, దాని మూడు పొరుగు జిల్లాలు, కడలూరుతో సహా 10 జిల్లాల్లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, స్టేట్ ఫోర్స్ నుండి దాదాపు 400 మంది సిబ్బందితో కూడిన 12 బృందాలను మోహరించినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. మొత్తం 24 జిల్లాలో స్కూల్స్ ,కాలేజీలకు సెలవులు ప్రకటించారు. చెన్నై నుంచి వెళ్ళే 15 విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో మాండూస్ ప్రభావం కనిపిస్తోంది. తమిళనాడు లోతట్టు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి తేలికపాటి వర్షం మొదలైంది. చెన్నై, కడలూరు, మైలాడుతురై, నాగపట్టణం, తిరువారూరు, తంజావూరు, పుదుక్కోట్టై , కాంచీపురం, చెంగల్పట్టు, కళ్లకురిచ్చి, తిరుచ్చి, శివగంగై, రామనాథపురం జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది.
నైరుతి బంగాళాఖాతంలో తుఫాను ‘మాండూస్ మరింత ముందుకు కదిలిందని, ఇది చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 480 కి.మీ, కరియాకల్ నుంచి 390 కి.మీ దూరంలో వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలతో పాటు కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తా తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రదేశాలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. తుఫాను పుదుచ్చేరి, మహా బలిపురం, శ్రీహరికోట మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్న నేపథ్యంలో 10వ తేదీ వరకు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.
Also Read
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
Uttarakhand Accident : ఉత్తరాఖండ్ లో ఘోరం.. కాల్వలో పడ్డ కారు.. నలుగురి మృతి
ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి తీవ్ర తుఫానుగా మారుతుందని అంచనా. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 65-85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావంతో దక్షిణకోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వివరించారు. మాండస్ తుఫాను నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు దారీ చేశారు.
తాజావార్తలు
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!