Tamilnadu Rains: పొంగిపొర్లుతున్న డ్యామ్‌లు, నీటమునిగిన వీధులు.. తమిళనాడును ముంచెత్తిన వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu Rains: తమిళనాడులోని పలు ప్రాంతాల్లో శనివారం విస్తారంగా వర్షాలు కురిశాయి, దీని ఫలితంగా కొన్ని జిల్లాల్లో డ్యామ్‌లు నీటితో నిండిపోయాయి. రాష్ట్రంలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, రానున్న రోజుల్లో కూడా ఇది కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారత వాతావరణ శాఖ సూచన ప్రకారం.. ఆదివారం రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. చెన్నైలో వర్షంతో కూడిన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది.
భారీగా వరదలు వస్తున్న కొనసాగుతున్న నేపథ్యంలో కోయంబత్తూరు జిల్లాలోని డ్యామ్‌లు కూడా పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా తేని, దిండిగల్, మదురై, శివగంగ, రామనాథపురం జిల్లాలకు వరద హెచ్చరికలు జారీ చేశారు. తేనిలోని వైగై డ్యామ్ నుంచి కూడా మొత్తం 4,230 క్యూబిక్ అడుగుల అదనపు నీటిని విడుదల చేసినట్లు డ్యామ్ అధికారి తెలిపారు. బంగాళాఖాతంలో శ్రీలంక తీరంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో చెన్నైలోని పలు ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
Pet Dog Menace: పెంపుడు కుక్క దాడి చేస్తే యజమానికి రూ.10 వేల జరిమానా.. ఎక్కడంటే?
అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈశాన్య రుతుపవనాల సీజన్ కాగా.. తమిళనాడు, పుదుచ్చేరి-కరైకల్ ఇతర సమీప ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాంతీయ వాతావరణ కేంద్రం అధికారి ప్రకారం, ఈశాన్య రుతుపవనాల కారణంగా రాష్ట్ర రాజధానిలో సగటు కంటే 20 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉండగా.. మత్స్యకారులను దక్షిణ ఆంధ్రప్రదేశ్-ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాలను ఆనుకుని ఉన్న నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతం వెంబడి వేటకు వెళ్లవద్దని వాతావరణ కార్యాలయం హెచ్చరించింది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..