రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. గత నెల రోజులుగా తన ప్రతాపాన్ని చూపించిన భానుడు.. వరుణ దేవుడు పలకరించడంతో కాస్త చల్లబడ్డాడు. గత రెండు రోజులుగా విస్తారంగా పడుతున్న వర్షాలకు రోడ్లు, డ్రైనేజీల్లో వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది.
Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వాతావరణం పూర్తిగా మారిపోయింది.. కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు.. ఇంకా కొన్ని చోట్ల భారీ వర్షలు కురుస్తున్నాయి.. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అయితే ఈ రోజు వడగళ్లవానతో భారీ నష్టం వాటిల్లింది.. హైదదరాబాద్, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియగా.. శివారు ప్రాంతాలు, కొన్ని జిల్లాల్లో వడగళ్లవాన పడింది.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల…
Heavy Rains: ఎండలు మండిపోతోన్న వేళ చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ.. వరుసనగా నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.. ముందుగా ఈ నెల 16వ తేదీ నుంచి వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన భారత వాతావరణ విభాగం (ఐఎండీ).. ఇప్పుడు ఒకరోజు ముందుగానే.. అంటే ఇవాళ్టి నుంచే వర్షాలు ప్రారంభం అవుతాయని పేర్కొంది.. జార్ఖండ్ నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ వరకు ఒక ద్రోణి కొనసాగుతోందని.. దీని ప్రభావంతో..…
న్యూజిలాండ్‌పై గ్యాబ్రియెల్ తుఫాను విరుచుకుపడింది. ఈ తుఫాన్ దాటికి న్యూజిలాండ్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ఉత్తర దీవిలో పెద్ద మొత్తంలో వర్షం కురిసింది.
13 Killed, 23 Missing In Philippines Floods: ఆగ్నేయాసియా దేశం ఫిలిప్పీన్స్ భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతోంది. ఎప్పుడూ లేని విధంగా వరదలు రావడంతో ప్రజలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది వర్షాలు, వరదల కారణంగా మరణించారు. పలువురు గల్లంతు అయ్యారు. చాలా మంది నిరాశ్రయులు అయ్యారు. క్రిస్మస్ రోజు కురిసిన భారీ వర్షాల వల్ల దేశంలో ఇప్పటి వరకు 13 మంది మరణించారు. మరో 23 మంది మత్స్యకారులు తప్పిపోయారు.
Mandous Cyclone : మాండూస్ తుపాన్ కారణంగా చెన్నై నగరం చెత్తమయమైంది.ఈ నెల 9వ తేదీన తుపాను తీరం దాటే సమయంలో ఈదురు గాలులకు 100కు పైగా ప్రాంతాల్లో 207 చెట్లు, చెట్ల కొమ్మలు రోడ్లపై పడ్డాయి.
మాండూస్ తుఫాన్ తీరం దాటిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం తెలిపింది. రాత్రి 1:30 గంటలకు పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తుఫాన్ తీరం దాటింది.