Telangana Rains: రాష్ట్రాన్ని ముంచెత్తిన వాన.. దిక్కుతోచని స్థితిలో రైతన్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Rains: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు చేసేందుకు ఇబ్బందులు పడుతున్న రైతులపై వరుణుడు కూడా కరుణించలేదు. గురువారం ఒక్కసారిగా కురిసిన వర్షానికి ధాన్యం కుప్పలన్నీ కొట్టుకుపోయాయి. కల్లాలో కళ్ల ముందే కొట్టుకుపోతున్న వరిపంటను చూసి రైతుల కన్నీరు మున్నీరయ్యారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. రైతులు రాత్రంతా నిద్ర మానేసి కాలువలు తవ్వి నీటిని తొలగించారు. అధికారుల తీరుపై రైతులు కల్లాల వద్దే నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం, సిద్దిపేట జిల్లా వర్గల్‌లో వర్షం కారణంగా ధాన్యం తడిసింది. మెదక్ జిల్లా కొల్చారం, చిలిప్ చెడ్, నిజాంపేట్, రామాయంపేట మండలాల్లో, సంగారెడ్డి జిల్లా జిన్నారంలో వరి తడిసింది.. కోహిర్ మండలంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానకు మామిడి, అరటి, బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి.
Read also: Char Dham Yatra: చార్‌ధామ్ యాత్రలో భక్తుల రద్దీ.. ఈనెల31 వరకు వీఐపీ దర్శనాలు బంద్
Also Read
- MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
- Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
- TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
- Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్లైన్.!
మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ లో ఆరుబయట కుప్పలు వేసిన ధాన్యం, మొక్కజొన్న తడిసి ముద్దయ్యాయి. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి, దుబ్బాక మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. గజ్వేల్ రింగ్ రోడ్డు వెంబడి నూర్చిన ధాన్యం కొట్టుకుపోయింది. రోడ్డు పక్కన కొట్టుకుపోయిన వరి ధాన్యాన్ని రైతులు సేకరిస్తున్నారు. సింగతం, శ్రీగిరిపల్లి, అహ్మదీపూర్, బూరుగ్‌పల్లి, దిలాల్‌పూర్, షేర్‌పల్లి గ్రామాలకు వెళ్లే దారిలో రోడ్ల పక్కన ఎండిపోయిన వడ్లూడిదీ దాదాపు ఇదే పరిస్థితి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కొనుగోలు కేంద్రం వడ్ల రాసు చుట్టూ నీరు నిలిచి రైతులు ఇబ్బందులు పడ్డారు. కరీంనగర్ మార్కెట్ యార్డులోనూ తడిసిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు పడిగాపులు కాశారు. ఇక
TS TET Hall Ticket: తెలంగాణ టెట్ హాల్‌టికెట్లు విడుదల..
తాజావార్తలు
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!