Cloudburst: ఈశాన్య రాష్ట్ర అరుణాచల్ ప్రదేశ్ భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతోంది. ‘‘క్లౌడ్ బరస్ట్’’ కారణంగా ఆ రాష్ట్రంలో భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో వరదలు పెరిగాయి. ఇటానగర్‌లో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా చోట్ల ఆస్తి నష్టం జరిగింది. వరదల కారణంగా అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.
చైనాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలో.. రానున్న తుఫాను దృష్ట్యా ఎమర్జెన్సీని పొడిగించారు. అక్కడి వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. రాబోయే వారంలో యాంగ్జీ నది మధ్య, దిగువ ప్రాంతాలలో నిరంతరంగా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన నేపథ్యంలో ఈ అత్యవసర పరిస్థితి ఏర్పడింది.
Rain Alert: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చాయి. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అందుకు తగ్గట్టుగానే జూన్ ప్రారంభం నుంచి వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి.
IMD warning: పశ్చిమ, నైరుతి దిశల నుంచి తెలంగాణ వైపు దూసుకుపోతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కొన్ని చోట్ల, రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు.
Floods in Sikkim: ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పర్యాటకులు పలు ప్రాంతాల్లో స్ట్రక్ అయిపోయారు. బుధవారం రాత్రి ఉత్తర సిక్కింలో 220 మి.మీకు పైగా వర్షం కురిసింది
మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతంలో వర్షం బీభత్సం సృష్టించింది. జూన్ 1 నుంచి ప్రారంభమైన వర్షాల ప్రభావంతో.. ఇప్పటి వరకు 14 మంది చనిపోయారు. ఇందులో పిడుగుపాటు కారణంగా 11 మంది మృతి చెందారు. డివిజనల్ కమిషనర్ కార్యాలయం రూపొందించిన ప్రాథమిక సర్వే నివేదిక ప్రకారం.. గత రెండు రోజుల్లో పర్భానీ, హింగోలి జిల్లాల్లో నాలుగు మరణాలు నమోదయ్యాయి.
భారీ వర్షాలు, ఇతర విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొని పౌరులకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధి వరకు జీహెచ్ ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలను విస్తరించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. హైదరాబాద్ నగరంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు ఆకస్మిక వర్షాలు, వరదలు వచ్చినా.. ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు రాకుండా తగు వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా…
Yellow Alert: రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి.
CS Shantikumari: భారీ వర్షాల కారణంగా నగరంలో ట్రాఫిక్ జామ్, వరద నీటి నిల్వ వంటి సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు.