ఆప్ఘనిస్తాన్‌ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వరదలకు 200 మంది మృతిచెందినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని తాలిబన్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. మరోవైపు రంగంలోకి దిగిన సహాయ సిబ్బంది.. పరిస్థితుల్ని చక్కబెడుతున్నారు. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో ఈ వరదలు సంభవించాయి. ఈ వరదల కారణంగా ఒక్క ప్రావిన్స్‌లోనే 200 మందికి పైగా మరణించారు. ఈ ఆకస్మిక వరదల్లో 200 మందికి పైగా మరణించారని ఐక్యరాజ్యసమితి శనివారం తెలిపింది. ఇక అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: IPL 2024 GT: శుభ్‌మన్ గిల్ అండ్ టీంకు షాకిచ్చిన ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ..
వరదలు కారణంగా ఇళ్లు, వాహనాలు భారీగా దెబ్బతిన్నాయి. ఇళ్లు కూలిపోగా.. వాహనాలు కొట్టుకుపోయాయి. మరోవైపు రహదారులు, వీధులన్నీ బురదతో నిండిపోయాయి. దీంతో జనాలు సంచరించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం కురిసిన భారీ వర్షాల కారణంగా గ్రామాలు, పొలాలు, నదులు పొంగిపొర్లాయి. బగ్లానీ జాడిద్‌లో 1,500 వరకు గృహాలు దెబ్బతిన్నాయి.
ఇక రోడ్లపై మృతదేహాలు పడి ఉన్నాయి. బురదలో కప్పబడ్డాయి. ఇంకోవైపు పిల్లల ఏడుస్తూ వీడియోల్లో కనిపించారు. ఇదిలా ఉంటే శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉండొచ్చని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Gautam Gambhir: గంభీర్ భయ్యా.. మీరు వెళ్లినప్పుడు మా హృదయం ముక్కలైంది!
ఈ వరదలు కారణంగా భారీగానే ఆస్తి నష్టం జరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకోవైపు భారీగానే ఆస్తి, ప్రాణ నష్టం జరిగి ఉండొచ్చని తాలిబన్ అధికారులు భావిస్తున్నారు. రెండు, మూడ్రోజుల్లో ఎంత నష్టం జరిగిందో తెలుస్తుంది.
ఇది కూడా చదవండి: Allu Arjun : అందుకే వైసీపీ అభ్యర్ధికి మద్దతు.. ఆ విషయంలో సంబంధం లేదు.!