Uttarakhand: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో పలు చోట్ల కొండచరియలు విరిగిపడిపోతున్నాయి. చమోలీ జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యాత్రికులు మరణించినట్లు అక్కడి పోలీసులు తెలిపారు.
Hyderabad Rains: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు, రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Floods In Manipur: మణిపూర్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. జనజీవనం అస్తవ్యస్తం అయింది. పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ అనుసూయ ఉయికే ఇవాళ (బుధవారం) రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించింది.
Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వాతావరణం చల్లబడడమే కాకుండా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. తాజాగా వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు వర్ష హెచ్చరిక జారీ చేసింది.
ద్రోణి ప్రభావంతో రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు...బుధ, గురువారాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క సారిగా వెదర్ మారిపోయింది. పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అలాగే, పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే వెదర్ డిపార్ట్మెంట్ మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గంగ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాల కారణంగా హరిద్వార్‌లోని ఖర్ఖారీ నదిలో ఆగి ఉన్న వాహనాలు గంగా నదిలో కొట్టుకుపోయాయి. అదే సమయంలో.. ఉత్తర హరిద్వార్‌లో ప్రజల ఇళ్లలోకి నీరు ప్రవేశించింది.
తెలంగాణలో రుతుపవనాలు విస్తరించడంతో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జూన్ 27న హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ దుమ్నా ఎయిర్‌పోర్ట్‌లో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాలు కారణంగా టెర్మినల్ రూఫ్‌టాప్ పడిపోయింది. పార్కు చేసిన కారు మీద పడడంతో నుజ్జునుజ్జు అయింది. ప్రమాదానికి కొద్ది సేపటి క్రితమే కారులోంచి ఆదాయపు పన్ను అధికారి, డ్రైవర్ కిందకి దిగారు. లేదంటే ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి.