ప్రపంచ ప్రసిద్ధ బాడీబిల్డర్‌గా పేరుగాంచిన ఇలియా యెఫిమ్‌చిక్ గుండెపోటుతో మరణించారు. అతని వయస్సు కేవలం 36 సంవత్సరాలు.. అతను చాలా ఫిట్గా ఉన్నప్పటికీ.. గుండెపోటుతో చనిపోవడం అందరూ షాక్‌కు గురయ్యారు.
Teeth Implants: దంతాల సర్జరీ ఒకరి ప్రాణాలను తీసింది. ఒకే రోజు ప్రమాదకరమైన రీతిలో ఈ సర్జరీ సాగడంతో రోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తూర్పు చైనాలోని జరిగింది. హువాంగ్ అనే ఇంటిపేరు కలిగిన వ్యక్తి ఆగస్టు 14న జెజియాంగ్ ప్రావిన్స్‌లోని జిన్హువాలోని యోంగ్ కాంగ్ దేవే డెంటల్ ఆస్పత్రిలో దంతాలకు సంబంధించిన ఒక ప్రొసీజర్ చేయించుకున్నాడు.
Heart Diseases: ఇటీవల కాలంలో గుండెకు సంబంధించిన వ్యాధులు పెరుగుతున్నాయి. గతంలో గుండెపోటు అనేది ఎక్కువగా వయసు పైబడిన వారికి వచ్చే ఆరోగ్య సమస్యగా భావించేవారు. అయితే, ఇప్పుడు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ గుండె వైఫల్యాల వల్ల మరణిస్తున్నారు. అయితే, గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ అనే రెండు భిన్నమైన కండిషన్స్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రెండు గుండెకు సంబంధించిన విషయాలే అయినప్పటికీ, వీటి మధ్య వ్యత్యాసం ఉంటుంది.
తిరుమలలో విషాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో గుండెపోటుతో మహిళ మృతి చెందింది. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లో ఈ ఘటన జరిగింది.
శరీరం ఫిట్, స్లిమ్‌గా ఉండేందుకు చాలా మంది జిమ్‌కి వెళ్తుంటారు. అయితే.. జిమ్లో జిమ్ చేసేముందు ఒక తప్పిదం చేస్తున్నారు. దీంతో.. మనుషులు గుండెపోటుకు గురవుతున్నారు. అయితే.. జిమ్ చేసే ముందు అనేక గుండె సంబంధిత పరీక్షలు చేసుకోవాలని జిమ్ ట్రైనర్లు చెబుతుంటారు. కానీ.. చాలా తక్కువ మంది మాత్రమే ఈ పరీక్షలన్నీ చేయించుకుంటున్నారు.
దేశంలో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరుగుతోంది. గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ ప్రమాదాల బారిన చాలా మంది పడుతున్నారు. ఇవన్నీ అకాల మరణాల ప్రమాదానికి దారితీస్తాయి. యువత కూడా ఈ సమస్యల బారిన పడుతున్నారని ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయి. ఈ సమస్యలను సకాలంలో పరిష్కరించి చికిత్స తీసుకుంటే ప్రమాదాల బారి నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
పిల్లలు, యువకులు, పెద్దలు అనే తేడా లేకుండా గుండెపోటు మరణాలు అందరిలోనూ వస్తున్నాయి. తాజాగా.. యూపీలోని అమ్రోహాలో యూకేజీ (UKG) చదివే చిన్నారి గుండెపోటుకు బలయింది. ఉన్నట్టుండి తరగతి గదిలో అస్వస్థతకు గురి కాగా.. వెంటనే చిన్నారిని గజ్రాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పరిశీలించి చనిపోయినట్లు ప్రకటించారు.
యువతలో గుండెపోటు కేసులు అధికమవుతున్నాయి. రోజుకు ఎక్కడో చోట హార్ట్ ఎటాక్ తో బలవుతున్నారు. తాజాగా.. గుజరాత్ లోని జామ్‌నగర్‌కు చెందిన 19 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థి జిమ్లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇక్కడ కూడా జిమ్లో వ్యాయామం చేస్తుండగా గుండె ఆగిపోయింది. గుండెపోటు రావడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
Live Heart Attack: కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ నాయకుడు మరణించారు. మృతి చెందిన నాయకుడిని రవి చంద్రన్‌గా గుర్తించారు. లాల్ మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన ఉన్నారు. ముడా కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మద్దతు తెలిపేందుకు చంద్రన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. కురుబర సంఘం అధ్యక్షుడు, కోలారు జిల్లాకు చెందిన రవిచంద్రన్ కు హఠాత్తుగా గుండెపోటు వచ్చి అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఈ మొత్తం ఘటనను కెమెరాలో…
ఇటీవల నాగ్‌పూర్ జిల్లా కోర్టులో న్యాయమూర్తి చేసిన పని చర్చనీయాంశమైంది. జడ్జి ఎస్బి పవార్ కోర్టులో ఒక కేసు చర్చిస్తుండగా.. అదే సమయంలో 65 ఏళ్ల సీనియర్ న్యాయవాది తలత్ ఇక్బాల్ ఖురేషీ తన కేసులో న్యాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలోనే న్యాయవాది ఖురేషీ ఉన్నట్టుండి కింద పడిపోయాడు. అది చూసిన జడ్జి పవార్.. ఒక్కసారిగా తన కుర్చీలోంచి లేచి వెంటనే అతని దగ్గరకు వచ్చారు. అంతేకాకుండా.. జడ్జి పవార్ వెంటనే న్యాయవాదికి సీపీఆర్ (CPR) చేశారు.…