Bus Driver Saves 50 Students:ఏకంగా 50 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడి.. తనువు చాలించాడు ఓ స్కూల్ బస్సు డ్రైవర్.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట సెంటర్‌లో ఈ రోజు ఉదయం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రాజమండ్రి గైట్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు డ్రైవర్ దెందుకూరి నారాయణరాజు (60) తన కర్తవ్య నిర్వహణలో విద్యార్థుల ప్రాణాలను కాపాడి తాను మాత్రం ప్రాణాలు…
మరికాసేపట్లో పెళ్లి. ఇళ్లంతా సందడి వాతావరణం నెలకొంది. పెళ్లికి వచ్చిన బంధువులు సంగీత్ లో పాల్గొని ఆనందంగా గడుపుతున్నారు. కానీ ఇక్కడే విది వింతనాటకం ఆడింది. పెళ్లికూతురు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయింది. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ జిల్లాలోని బర్గాడి గ్రామంలో జరిగిన విషాద సంఘటన మొత్తం గ్రామాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. వధువు పూజ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె గుండెపోటుతో మరణించినట్లు ప్రకటించారు. Also…
దుబాయ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. గోల్డెన్ వీసా కలిగి ఉన్న 18 ఏళ్ల భారతీయ విద్యార్థి వైష్ణవ్ కుమార్ గుండెపోటుతో మృతిచెందాడు. దీపావళి రోజునే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
కన్నడ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్‌లో ఉండగా హాస్యనటుడు రాజు తలికోటే(59) హఠాన్మరణం చెందారు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో రాజు తాలికోటే ప్రాణాలు కోల్పోయారు.
గుంటూరు జిల్లాలో ఓ ఎస్సై గుండెపోటుతో మృతిచెందాడు.. తుళ్లూరు ట్రాఫిక్ ఏఎస్సైగా పనిచేస్తున్న రవీంద్ర.. ఈ రోజు మందడంలో విధులు ముగించుకుని కారు డ్రైవ్ చేస్తూ గుంటూరు వెళ్తుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు.. తుళ్ళూరు దాటగానే ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో కారు ఆపారు రవీంద్ర. కొద్దిసేపటికే కారులోనే ప్రాణాలు కోల్పోయాడు..
గుండె పోటు మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్ద వాళ్ల వరకు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. అప్పటి వరకు ఎంతో ఉల్లాసంగా కనిపించిన వారు క్షణాల్లోనే విలవిల్లాడుతూ కుప్పకూలుతున్నారు. ఆసుపత్రికి తరలించే లోపే తుది శ్వాస విడుస్తున్నారు. తాజాగా నాగోల్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ 25 ఏళ్ల యువకుడు షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న కొందరు యువకులు సీపీఆర్ చేసిన ప్రయోజనం లేకుండా…
విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. బస్సు నడుపుతుండగానే హార్ట్ ఎటాక్ రావడంతో.. స్టీరింగ్ పైనే కుప్పకూలిపోయాడు. దాంతో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గురువారం రాత్రి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు కావలి నుంచి బెంగళూరుకు…
గుండెపోట్లు పెద్దోళ్లకే కాదు.. ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా సంభవిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా మధ్య వయస్కులు ఎక్కువ మంది గుండెపోటుతో ప్రాణాలు వదులుతున్నారు.
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల కళాశాలలో విషాదం చోటు చేసుకుంది. గుండె నొప్పితో ఇంటర్ సెకండియర్ విద్యార్థి మృతి చెందాడు. ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బత్తిని మనితేజ (17) గుండె నొప్పితో మృత్యుఒడికి చేరుకున్నాడు. మణితేజ స్వగ్రామం శాయంపేట మండలం ప్రగతి సింగారం.
కర్ణాటక రాష్ట్రాన్ని ఆకస్మిక మరణాలు హడలెత్తిస్తున్నాయి. ఎక్కువగా యువకులే గుండెపోటుతో మరణిస్తున్నారు. గత జూన్ నెలలో హసన్ జిల్లాలో 23 మంది హార్ట్ఎటాక్తో ప్రాణాలు కోల్పోయారు.