Heart Attack Video: ఇండోర్‌లో వైద్యుడి వద్దకు చికిత్స కోసం వచ్చిన ఓ రోగి గుండెపోటుతో మృతి చెందాడు. ఆస్పత్రిలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో మృతికి సంబంధించిన వీడియో రికార్డయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని గ్రహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగిందని., పరదేశిపుర పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ పంకజ్ ద్వివేది తెలిపారు. ఓ యువకుడు ఛాతీ నొప్పితో ఆస్పత్రికి వచ్చినట్లు ఈ వీడియోలో స్పష్టంగా అర్థమవుతుంది.…
ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్ గుండెపోటుతో మరణించారు. ఆదివారం రాత్రి చెన్నైలో తుది శ్వాస విడిచారు. సమాచారం ప్రకారం.. రాకేష్ పాల్ అనారోగ్యంతో బాధపడుతూ రాజీవ్ గాంధీ జనరల్ హాస్పిటల్ (RGGH) లో ఆదివారం ఉదయం చేరారు.
మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అని కూడా పిలువబడే గుండెపోటు అనేది తీవ్రమైన వైద్య అత్యవసర పరిస్థితి. ఇది ప్రాణాంతకం కావచ్చు. గుండెలోని ఒక భాగానికి రక్త ప్రవాహం నిరోధించబడినప్పుడు గుండె కండరాలకు ఆక్సిజన్ అందకుండా చేసినప్పుడు ఇది సంభవిస్తుంది. ఈ సంభావ్య ప్రాణాంతక పరిస్థితిని నివారించడానికి గుండెపోటుకు కారణాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇకపోతే గుండెపోటు దోహదపడే అనేక అంశాలు ఉన్నాయి. గుండెకు ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తాన్ని సరఫరా చేసే కొరోనరీ ధమనులలో ఫలకం ఏర్పడటం…
దేశంలో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరుగుతోంది. అందులో గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ ఇలాంటి అనేక రకాల వ్యాధులు ఉన్నాయి. ఇవన్నీ అకాల మరణాల ప్రమాదానికి దారి తీస్తాయి. ఈ సమస్యల బారిన యువత కూడా పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. కాగా.. అనేక దీర్ఘకాలిక వ్యాధులను సకాలంలో పరిష్కరించి చికిత్స చేస్తే వాటి కారణాలను తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
యూపీ రాష్ట్రం ఘాజీపూర్‌లోని వీర్‌పూర్ గ్రామంలో శుక్రవారం విషాదం చేటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ మహిళ పాముకాటుతో మృతి చెందింది. మృతదేహాన్ని చూసిన కొంతసేపటికి భర్త కూడా షాక్‌కు గురై గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కుమారులు, కుమార్తెల రోదనలతో గ్రామస్తుల కంట కన్నీరు మున్నీరైంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని భార్యాభర్తల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
గుండెపోటును మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అని కూడా పిలుస్తారు. ఇది గుండెకు రక్త ప్రవాహం నిరోధించబడినప్పుడు సంభవించే తీవ్రమైన వైద్య అత్యవసర పరిస్థితి. ఇది గుండె కండరాల కణజాలం దెబ్బతినడానికి లేదా మరణానికి దారితీస్తుంది. మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్లు అని కూడా పిలువబడే గుండెపోటుకి దోహదపడే అనేక అంశాలు ఉన్నాయి. గుండెపోటులకు ప్రధాన కారణాలను అర్థం చేసుకోవడం అనేది నివారణ లేదా ముందస్తు జాగ్రత్తలకు కీలకం. గుండెపోటుల వెనుక ఉన్న వివిధ కారణాలను, వాటిని ఎలా నిర్వహించవచ్చో ఒకసారి చూద్దాం.…
గర్భిణులకు పోషకాహారం చాలా చాలా అవసరం. ఎందుకంటే గర్భంలో బిడ్డ శారీరక ఎదుగుదల, ఆరోగ్యం బాగుండాలంటే ఖచ్చితంగా పోషకాహారాన్ని తింటూ ఉండాలి. రోజూ మీరు తినే ఆహారంలో పోషకాలు పుష్కలంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో 49 ఏళ్ల స్కూల్ బస్సు డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన సురక్షితంగా ఆపి సుమారు 20 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడాడు. అనంతరం.. కొద్దిసేపటికే అతను కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందాడు. వెంటనే గమనించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా అక్కడికి చేరుకునేలోపే చనిపోయినట్లు ప్రకటించారు.
Heart Attack while Driving College Bus in Hyderabad: తాజాగా హైదరాబాద్ మహానగరంలో కాలేజ్ బస్సు డ్రైవర్ కు గుండెపోటు రావడం సంచల విషయంగా మారింది. ఈ సంఘటనలో తనకు గుండెపోటు వస్తుందని గ్రహించిన బస్సు డ్రైవర్ తాను డ్రైవ్ చేస్తున్న కాలేజీ బస్సులో విద్యార్థులు ఉన్నారన్న ఆలోచనతో వారిని ప్రాణాలని కాపాడాలని ఆలోచించి నడుపుతున్న వాహనాన్ని పక్కకు ఆపి ప్రాణాలు వదిలిన సంఘటన ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి…
ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు టెర్మినల్ 2 వద్ద గుండెపోటు వచ్చి అకస్మాత్తుగా కుప్పకూలిన ఓ వృద్ధుడిని ఒక వైద్యురాలు కాపాడింది. కార్డియాక్ అరెస్ట్‌తో కుప్పకూలిన సెకన్ల వ్యవధిలో స్పందించి సీపీఆర్ చేసి ఆయన ప్రాణాలను రక్షించింది.