ఏపీ అసెంబ్లీలో విధులు నిర్వహిస్తున్న మార్షల్ గుండెపోటుతో మృతి చెందాడు. కె.లూధియారావు అనే మార్షల్‌కు ఉదయం విధుల్లో ఉండగా గుండెపోటు రాగా.. వెంటనే తోటి సిబ్బంది మంగళగిరి ఎన్నారై హాస్పటల్‌కు తరలించారు.
ఓ ప్రైవేట్ స్కూల్‌లో విద్యార్థులు, తోటి స్టాఫ్‌తో కలిసి ప్రేయర్ చేస్తున్న టీచర్ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అనంతరం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
రాజస్థాన్‌లో విషాదం చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న పదహారేళ్ల విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. మరణించిన విద్యార్థి యతేంద్ర ఉపాధ్యాయగా గుర్తించారు. అయితే.. నిన్ననే తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోగా, ఈరోజు గుండెపోటుతో మరణించాడు. బండికుయ్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో శనివారం ఉదయం 7 గంటల సమయంలో తరగతి గది లోపలికి వస్తుండగా ఒక్కసారిగా పడిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది.
Prize Money: అదృష్టం ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది.. దురదృష్టం తలుపు తిసేవరకు కొడుతుందని ఓ సామెత ఉంది. ఈ సామెత మాదిరిగానే ఓ వ్యక్తికి అదృష్టం తలుపు తట్టింది. కానీ ఆయన దాన్ని అనుభవించే అదృష్టం పొందలేకపోయాడు. జననానికైనా.. మరణానికైనా.. ఒక్క కనురెప్పపాటు సమయం చాలు. ఆ సమయంలోనే ధనవంతుడు బిచ్చగాడు కాగలడు., అలాగే బిచ్చగాడు ధనవంతుడు కూడా అవుతాడు. ఇలాంటి సంఘటన సంబంధించి అనేక విషయాలు సోషల్ మీడియా ద్వారా చూసే ఉంటాము. తాజాగా…
మారుతున్న సమాజానికి అనుగుణంగా రోజు రోజుకూ టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లతో పాటు.. స్మార్ట్‌వాచ్‌ల హవా నడుస్తోంది. కంపెనీలను బట్టి స్మార్ట్ వాచ్ లు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో లభిస్తున్నాయి.
టీ, కాఫీ లు తాగని వాళ్లు అసలు ఉండరేమో.. పొద్దున్నే గొంతులో టీ పడితే చాలు ఇక రోజంతా హాయిగా గడుస్తుందని చాలా మంది అనుకుంటారు.. అయితే రకరకాల టీని తాగుతుంటారు. కొన్ని రకాల టీలను తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ఈరోజుల్లో ఎక్కువగా లెమన్ గ్రాస్ టీని ఎక్కువగా జనాలు తాగుతున్నారు.. ఈ టీని రోజు తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.. నిమ్మగడ్డితో…
మనదేశంలో ఈ మధ్య హార్ట్ ఎటాక్ తో చనిపోతున్న వారిసంఖ్య రోజు రోజుకు ఎక్కువవుతుంది. కోవిడ్ వచ్చి వెళ్లాక చాలా మంది రక్తం గడ్డ కట్టి చనిపోతున్నారు.. దీనికి కారణాలు అనేకం ఉన్నా కూడా అసలు కారణం ఇదని చెప్పలేకపోతున్నారు.. హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే మాత్రం కొన్ని తప్పక తినాలని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూసేద్దాం.. అవకాడోల గురించి అందరికీ తెలిసిందే. వీటిల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులతోపాటు పొటాషియం సమృద్ధిగా…
నిజామాబాద్ జిల్లా కేంద్రం గౌతం నగర్లో తీవ్ర విషాదం నెలకొంది. విజయ్ అనే యువకుడు క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. నగరంలోని అమ్మ వెంచర్లో స్నేహితులతో కలిసి విజయ్ క్రికెట్ ఆడుతుండగా.. గుండెపోటు వచ్చింది. దీంతో గమనించిన తోటి స్నేహితులు వెంటనే ఆసుపత్రికి తరలించే లోపు యువకుడు విజయ్ మృతి చెందాడు.
ముంబైలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం కశ్మీరా ప్రాంతంలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఓ కంపెనీ తమ ఉద్యోగులకు క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించింది. అందులో పాల్గొన్న ఓ వ్యక్తి బంతిని గట్టిగా కొట్టాడు. అనంతరం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే.. అతన్ని సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడికి చేరుకునేలోపే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుడు రామ్ గణేష్ తేవార్‌గా గుర్తించారు.