Cardiac arrest: ఇటీవల కాలంలో గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ వంటి గుండె జబ్బులు ఎక్కువ అవుతున్నాయి. ఒకానొక సమయంలో గుండె జబ్బులు మధ్య వయస్కులకు, వృద్ధులకు వస్తుందని మాత్రమే భావించే వారు, కానీ ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా పలువురు గుండె పోటు వల్ల మరణిస్తున్నారు. అప్పటి వరకు బంధువులు, మిత్రులతో సంతోషంగా ఉన్నవారు ఉన్నట్లుండి అకాస్మత్తుగా కుప్పకూలిపోతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో చాలా జరిగాయి.
Read Also: Russia-Ukraine: ఫలించిన మోడీ ప్రయత్నాలు.. యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకున్న రష్యా- ఉక్రెయిన్
ఇదిలా ఉంటే, లక్నోలో 9 ఏళ్ల బాలిక కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించింది. ఓ రకంగా చెప్పాలంటే గుండె పని చేయకపోవడంతో మరణించింది. మాంట్ ఫోర్ట్ స్కూల్‌లో 9 ఏళ్ల విద్యార్థిని ఆడుకుంటున్న సమయంలో కార్డియాక్ అరెస్ట్ వల్ల మరణించినట్లు ప్రిన్సిపాల్ శనివారం తెలిపారు.
గురువారం పాఠశాల ప్రిన్సిపాల్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. 3వ తరగతి చదువుతున్న మాన్వి సింగ్ ఆట స్థలంలో అపస్మారక స్థితిలో పడిపోయినట్లు సమాచారం అందడంతో ఆమెని సమీపంలోని ఫాతిమా ఆస్పత్రికి తరలించారు. బాలిక కుటుంబ సభ్యుల ఆమెను మెరుగైన చికిత్స కోసం చందన్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆమె చనిపోయినట్లు వైద్యులు చెప్పారని ప్రిన్సిపాల్ తెలిపారు. బాలిక మృతి చెందినట్లు సమాచారం అందడంతో శుక్రవారం పాఠశాలకు సెలవు ప్రకటించారు.