శరీరం ఫిట్, స్లిమ్‌గా ఉండేందుకు చాలా మంది జిమ్‌కి వెళ్తుంటారు. అయితే.. జిమ్లో వ్యాయమం చేసే ముందు ఒక తప్పిదం చేస్తున్నారు. దీంతో.. మనుషులు గుండెపోటుకు గురవుతున్నారు. అయితే.. జిమ్ చేసే ముందు అనేక గుండె సంబంధిత పరీక్షలు చేసుకోవాలని జిమ్ ట్రైనర్లు చెబుతుంటారు. కానీ.. చాలా తక్కువ మంది మాత్రమే ఈ పరీక్షలన్నీ చేయించుకుంటున్నారు. అయితే.. మీ గుండె ఆరోగ్యంగా ఉందని, జిమ్‌లో వ్యాయామం చేయడం ద్వారా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉండదని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పల్స్ రేటును చెక్ చేసుకోండి:
పల్స్ రేటు అంటే హృదయ స్పందనల సహాయంతో గుండె ఆరోగ్యాన్ని తెలుసుకోవచ్చు. విశ్రాంతి సమయంలో మీ పల్స్ రేటు నిమిషానికి 80 ఉంటే అది పూర్తిగా సాధారణం. ఈ పల్స్ రేట్ సహాయంతో వ్యాయామశాలలో మీ గుండె ఆరోగ్యాన్ని చెక్ చేసుకోవచ్చు.
జిమ్లో వ్యాయామం ప్రారంభించే ముందు పల్స్ రేటును చెక్ చేసుకోండి.
వాకింగ్ లేదా జాగింగ్ చేసిన వెంటనే ఒక నిమిషం విశ్రాంతి తీసుకోండి. అప్పుడు పల్స్ రేటును మళ్లీ చెక్ చేయండి. పల్స్ రేటు సాధారణ విశ్రాంతి రేటుకు తిరిగి రావడానికి పట్టే సమయం గుండె ఆరోగ్యాన్ని సూచిస్తుంది. పల్స్ రేటు సాధారణ స్థితికి రావడానికి సమయం తీసుకుంటే.. ఒక నిమిషంలో 10 లేదా 20 పల్స్ రేట్లు తగ్గినట్లయితే, గుండె ఆరోగ్యం బాగా లేదని అర్థం. అటువంటి పరిస్థితిలో.. వెంటనే గుండె పరీక్ష అవసరం.
మరోవైపు.. పల్స్ రేటు సుమారు 30 తగ్గుతూ, సాధారణ విశ్రాంతి పల్స్ రేటుకు చేరుకుంటే అది సగటు గుండె ఆరోగ్యాన్ని సూచిస్తుంది. అందువల్ల.. జిమ్‌లో వ్యాయామం ప్రారంభించే ముందు, ఖచ్చితంగా మీ పల్స్ రేటును చెక్ చేసుకోండి. ఈ క్రమంలో.. గుండె ఆరోగ్య ప్రమాదాన్ని తగ్గించవచ్చు.