Papaya Leaves and Seeds: బొప్పాయి పండు తినడానికి రుచికరంగా ఉన్నప్పటికీ, వీటిని తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. బొప్పాయి తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీరు విన్నప్పటికీ.. దాని ఆకులు, విత్తనాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..? లేదు కదా.. అయితే, బొప్పాయి ఆకులు ఇంకా పండులోని విత్తనాలలో అనేక ఖనిజాలతో పాటు అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.…
చలి తీవ్రత నానాటికి పెరుగుతోంది. ఈ సీజన్ వస్తే చాలు అనారోగ్యాలు చుట్టుముడుతుంటాయి. మరోవైపు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి కారణాలతో మరణించే వారి సంఖ్య కూడా చలికాలంలోనే ఎక్కువగా ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే.. ఇతర సీజన్లతో పోలిస్తే శీతాకాలంలో గుండెపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. గుండె సంబంధిత సమస్యలు ఉన్న వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే.. ఈ సీజన్‌లో గుండెపోటు పెరగడానికి గల కారణాల గురించి తెలుసుకుందాం..
ఈ రోజుల్లో చాలామంది హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు. నడుస్తూ, డ్యాన్స్ చేస్తూ, కుర్చీలో కూర్చున్నప్పుడు లేదంటే నిలుచున్నప్పుడు కూడా సడెన్‌గా గుండెపోటుతో క్షణాల్లోనే ప్రాణాలు వదులుతున్నారు. శుభకార్యాలు, పెళ్లి వేడుకల్లో సైతం ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం పెనుమాడలో విషాదం చోటుచేసుకుంది.
చావు ఎప్పుడు.. ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. కళ్ల ముందు ఉన్నవారే ఉన్నట్టుండి మాయమైపోతున్నారు. ఇటీవల కర్ణాటకలో ముగ్గురు యువతులు.. స్విమ్మింగ్ ఫూల్‌లోకి ఈత కొట్టడానికి దిగి.. ఊపిరాడక కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయారు.
మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఓటింగ్ జరగగా, బీడ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బీడు అసెంబ్లీ స్థానంలో ఓటింగ్ సందర్భంగా ఓ స్వతంత్ర అభ్యర్థి గుండెపోటుతో మృతి చెందారు.
యూపీలో విషాదం చోటు చేసుకుంది. హత్రాస్ జిల్లాలోని భోజ్‌పూర్ ఖెత్సీ గ్రామానికి చెందిన ఓ యువకుడు పెళ్లికి ఒకరోజు ముందు గుండెపోటుతో మరణించాడు. అకస్మాత్తుగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ చనిపోయినట్లు చెప్పారు. దీంతో.. కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు.. వధువు ఇంట్లోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. కాబోయే భర్త మరణవార్త విన్న వధువు అపస్మారక స్థితికి చేరుకుంది.
Cardiac Arrests: ప్రస్తుత రోజుల్లో గుండెపోటు అనేది సర్వసాధారణమైపోయింది. ఇంతకుముందు ఈ సమస్య పెద్దవారిలో మాత్రమే కనిపించేది. కానీ, ఇప్పుడు యువత కూడా దీని బారిన పడుతున్నారు. ఎవరైనా డ్యాన్స్ చేస్తున్నప్పుడు, లేదా ఏదైనా పనిచేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా పడిపోయారని మీరు తరచుగా వినే ఉంటారు. అలాంటి వారు కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణిస్తారు. వీటన్నింటికీ ప్రధాన కారణం ధమనులలో ఫలకం అడ్డుపడటం. దీని కారణంగా రక్తం గుండెకు చేరదు. శరీరంలో ఆక్సిజన్ కొరత ఉంటుంది. ఈ…
బెంగళూరులో ఘోర బస్సు ప్రమాదం తప్పింది. బెంగళూరు మెట్రోపాలిటిన్ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్కు చెందిన బస్సుకు ప్రమాదం తప్పింది. బస్సు వేగంగా దూసుకుపోతుండగా ఒక్కసారిగా డ్రైవర్ కిరణ్ కుమార్కు (40) గుండెపోటు వచ్చింది. వెంటనే ఎడమ వైపునకు ఒరిగిపోయాడు.
మృత్యువులోనూ ఆ రక్త సంబంధం వీడలేదు. తమ్ముడి మృతిని తట్టుకోలేక అక్క గుండె ఆగిపోయింది. తమ్ముడి మరణాన్ని తట్టుకోలేక అక్క గుండెపోటుతో మృతి చెందిన విషాద ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.