Kolkata Doctor Rape Case: కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచార ఘటన తీవ్ర ప్రకంపనలు రేపుతుంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో చర్చలు జరిపిన వైద్యులు తమ నిరసనలు ఇంకా కొనసాగిస్తున్నారు. మరికొన్ని డిమాండ్లను వినిపించేందుకు మరోసారి ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
వైద్యారోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఫేక్ సదరం సర్టిఫికెట్లపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఫేక్ సదరం సర్టిఫికెట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంగవైకల్యంతో బాధపడేవారికి వివిధ రూపాల్లో పెన్షన్ అందిస్తున్నామని.. సదరం ఫేక్ సర్టిఫికేట్ల జారీపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
Jobs In Telangana: రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు ఉస్మానియా, గాంధీ ఆసుపత్రి లలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ల నియామకాల కాంట్రాక్ట్ ప్రాతిపాదిక పై తెలంగాణ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో మొత్తంగా 235 వివిధ స్థాయి డాక్టర్ల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. Ponguleti Srinivasa Reddy: పాలేరు మినీ హైడల్ ప్రాజెక్టు అధికారులపై ఆగ్రహించిన మంత్రి.. ఈ…
Sathya Kumar: ఆరోగ్య శ్రీ అమలుపై ఏపీ వైద్య మంత్రి సత్య కుమార్ మాట్లాడుతూ.. ఆరోగ్య శ్రీ ఎక్కడికి పోదు... యధావిధిగా నిర్వహిస్తామన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కు గత 5 ఏళ్లలో 13 సార్లు నోటీసులు ఇచ్చారు.. ఎన్డీయే అధికారంలోకి వచ్చి 50 రోజుల్లో.. అప్పుడే దుష్ప్రచారం చేస్తున్నారు.
Chandrababu: నేటి నుంచి ప్రభుత్వంలోని అన్ని శాఖలపై ఆంధ్రప్రదేశ్ నూతన సీఎంగా చంద్రబాబు నాయుడు సమీక్షలు చేయనున్నారు. అందులో భాగంగానే.. ఇవాళ వైద్య ఆరోగ్య శాఖపై తొలి సమీక్ష చేయనున్నారు.
సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి దామోదర రాజ నర్సింహ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీ ఉన్న ప్రతీ చోట నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం అధికారులను ఆదేశించారు.
మంత్రి దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరిగినా వైద్యులు సిద్ధంగా ఉన్నారు.. ఇప్పటికే అక్కడక్కడ కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.. అప్రమత్తంగా ఉండాలని అన్ని ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారికి కరోనా సన్నద్ధతపై వివరించాం.. అన్ని హస్పటల్స్ లో కరోనా టెస్ట్ ల సంఖ్య పెంచుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైయస్ జగన్ కీలక సమీక్ష నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్షపై అధికారులు సీఎంకు వివరాలందించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 1,22,69,512 కుటుంబాలను ఆరోగ్య సిబ్బంది సర్వే చేశారు. ఇప్పటి వరకూ మొత్తంగా 3,17,65,600 మందిని ఆరోగ్య సిబ్బంది కవర్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పరిస్థితిపై నేడు (గురువారం) వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు నిర్వహించారు.