AP CM YS Jagan: మందులు అందడం లేదన్న మాట రోగుల నుంచి రాకూడదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CM YS Jagan: వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైయస్ జగన్ కీలక సమీక్ష నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్షపై అధికారులు సీఎంకు వివరాలందించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 1,22,69,512 కుటుంబాలను ఆరోగ్య సిబ్బంది సర్వే చేశారు. ఇప్పటి వరకూ మొత్తంగా 3,17,65,600 మందిని ఆరోగ్య సిబ్బంది కవర్ చేశారు. జగనన్న సురక్ష కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టనే కాదు, వైద్య ఆరోగ్య శాఖ ప్రతిష్టను కూడా పెంచుతుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రోగులు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందాలని అధికారులను సూచించారు. రోగులకు ఇస్తున్న సదుపాయాలు మెరుగ్గా ఉండాలని ఆదేశించారు. ప్రతి కలెక్టర్‌కూ దీనిపై ప్రత్యేక ఆదేశాలు ఇవ్వడంతో పాటు కలెక్టర్‌కు మరిన్ని నిధులు ఇవ్వాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు సీఎం సూచించారు. హెల్త్ క్యాంపులను నిర్వహించడమే కాదు, చికిత్స అవసరమని గుర్తించిన వారి ఆరోగ్యం బాగు అయ్యేంత వరకూ చేయిపట్టుకుని నడిపించాలన్నారు.
Also Read: Bandla Ganesh: పవన్ మూడు పెళ్లిళ్లపై సీఎం జగన్ వ్యాఖ్యలు.. వీడియో రిలీజ్ చేసిన బండ్లన్న
Also Read
- Shubman Gill: "డోంట్ వర్రీ".. రోహిత్ రనౌట్ వివాదంపై శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Pawan Kalyan: నేడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. జనసేన జాతీయ విస్తరణ దిశగా కీలక అడుగు!
- Modi-Trump Meeting: మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు.. 16 నెలల తరువాత ఎదురుపడనున్న మోడీ, ట్రంప్..
- CJP Protest: నేడు హైదరాబాద్‌లో 'కాక్రోచ్ జనతా పార్టీ' ధర్నా.. సోనమ్ వాంగ్‌చుక్ హాజరు!
సీఎం జగన్ అధికారులతో మాట్లాడుతూ.. “అలాగే ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పాత పేషెంట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పాత పేషెంట్ల విషయంలో చేయిపట్టుకుని నడిపించాలి . చికిత్స అనంతరం వీరు వాడాల్సిన మందుల విషయంలో అవి ఖరీదైనా సరే వారికి అందించాల్సిన బాధ్యత ఉంది, ఇది రెండో అంశం. క్రమం తప్పకుండా వారికి చెకప్‌లు చేసే బాధ్యత తీసుకోవాలి. ఆరోగ్య శ్రీలో కవర్ కాకుండా గతంలో చికిత్సలు చేయించుకున్న పాత రోగుల విషయంలో కూడా వారికి చేయూతను అందించడం అన్నది మూడో బాధ్యత . వీరి బాధ్యతను కూడా తీసుకునేలా ఎస్‌ఓపీని రూపొందించండి :ఆరోగ్య పరంగా, చికిత్సల పరంగా, చెకప్‌ల పరంగా, మందులపరంగా ఎవరికి ఏ అవసరాలు ఉన్నా వారికి అవి తీర్చే దిశగా ఈ చేయూత ఉండాలి. ప్రతి సచివాలయం వారీగా ఇలా ఎవరెవరు ఉన్నారనేది వివరాలు తీసుకోండి. దీనికి అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే సమకూరుస్తుంది. విలేజ్‌క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లతో దీన్ని అనుసంధానం చేయాలి. అంతే కాకుండా క్రమం తప్పకుండా హెల్త్‌క్యాంపులను నిర్వహించాలి. ప్రతీ నెలకు మండలంలో నాలుగు సచివాలయాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలి . రోగుల సంతృప్తి, క్యాంపుల్లో సదుపాయాలు, రోగులకు చేయూత నందించడం, ఆరోగ్య సురక్ష కార్యక్రమంమీద అవగాహన, విస్తృత ప్రచారం ఈ 4 అంశాలమీద తప్పనిసరిగా సమీక్ష చేసుకోవాలి. ఆరోగ్య సురక్ష మీద ప్రతి వారం క్రమం తప్పకుండా నా దగ్గర సమీక్షలు చేయాలి. ఆరోగ్య శ్రీని ఎలా వినియోగించుకోవాలని తెలియని వ్యక్తి రాష్ట్రంలో ఉండకూడదు. ఆరోగ్య శ్రీ చికిత్సల కోసం వెళ్లే రోగులకు ప్రయాణ ఛార్జీలు కూడా ఇవ్వాలి.” అని సీఎం అధికారులను ఆదేశించారు.
ప్రతి ఒక్కరి ఫోన్‌లో కూడా ఆరోగ్య శ్రీ యాప్‌ని డౌన్లోడ్ చేయాలన్నారు. దీని వల్ల పర్యవేక్షణ మరింత సులభతరం అవుతుందన్నారు. “క్యాంపులకు స్పెషలిస్టులను పంపే విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. ఎక్కడా కూడా తొందరపాటు లేకుండా రోగులకు మంచి సేవలు అందేలా చర్యలు తీసుకోవాలి. క్యాంపులకు తప్పనిసరిగా నలుగురు వైద్యులు వెళ్లాలి, అందులో ఇద్దరు స్పెషలిస్టులు ఉండేలా చూడాలి. దీనికి తగినట్టుగా స్పెషలిస్టులను అందుబాటులో ఉంచేలా చూసుకోవాలి. అలాగే పరీక్షలు చేసేటప్పుడు మరింత నిర్ధారణ కోసం అదనపు పరీక్షలు కూడా చేసి, సరైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలి. ” అని వైద్యారోగ్య శాఖ అధికారులకు సీఎం సూచించారు.
Also Read: AP CM Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను సత్కరించిన వీఆర్‌ఏ సంఘం నాయకులు
ఇప్పటివరకూ 5216 ఆరోగ్య సురక్ష క్యాంపుల నిర్వహించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. సగటున ఒక్కో క్యాంపులో 357 మంది వస్తున్నట్టు వెల్లడించారు. క్యాంపుల ద్వారా దాదాపు 2841 మంది రక్తహీనత ఉన్న బాలికలను గుర్తించామని, వీరికి అన్నిరకాలుగా మందులు, పౌష్టికాహారం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రక్తహీనతతో ఉన్నవారిని గుర్తించిన వారికి పౌష్టికాహారాన్ని అక్కడే అందించేలా ఎస్‌ఓపీ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. పుట్టుకతోనే వివిధ రోగాలతో బాధపడుతున్న వారిని 251 మందిని శిబిరాల్లో గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. అలాగే దివ్యాంగులకు సర్టిఫికెట్లు ఇవ్వడంలోనూ మార్పులు రావాలని సీఎం సూచనలు చేశారు. నిపుణులైన వైద్యులు ఆరోగ్య సురక్షా శిబిరాలకు వస్తున్నప్పుడు అక్కడే వీరికి సర్టిఫికెట్లు జారీచేసేలా ఆలోచన చేయాలని సీఎం ఆదేశించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, వారికి అవసరమైన ఖరీదైన మందులు అందించే కార్యక్రమం కూడా జరగాలని సీఎం పేర్కొన్నారు. నాకు మందులు అందడంలేదన్న మాట రోగులనుంచి రాకూడదన్నారు. తిరుపతి తరహాలోనే చిన్నపిల్లలకోసం అత్యాధునిక ఆస్పత్రిని విజయవాడ–గుంటూరు, విశాఖపట్నంలలో ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.ప్రకాశం జిల్లాలో కూడా కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఆస్పత్రుల్లో నాడు – నేడు, కొత్త మెడికల్‌కాలేజీల నిర్మాణ ప్రగతిపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణ పనుల్లో పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. అర్భన్ హెల్త్ క్లినిక్కులు నిర్మాణ పనులను కూడా నిర్దేశించుకున్న లక్ష్యంలోగా పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు.
తాజావార్తలు
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Shubman Gill: “డోంట్ వర్రీ”.. రోహిత్ రనౌట్ వివాదంపై శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
WiFi Signal Issues : ఇంట్లో వైఫై స్పీడ్ తగ్గిపోతుందా? కారణం ఇంటర్నెట్ మాత్రమే కాదు.. ఈ విషయాలు కూడా చెక్ చేయండి!
-
Pawan Kalyan: నేడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. జనసేన జాతీయ విస్తరణ దిశగా కీలక అడుగు!
-
ChatGPT: చాట్ జీపీటీ వాడుతున్నారా?.. భారీ నష్టం తప్పదు!.. AI పాయిజనింగ్ ముప్పు గురించి తెలుసుకోండి
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!