సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మరో ముందడుగు వేసింది. ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగాన్ని బలోపేతం చేయాలనే ఆలోచనతో వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.
Health Department:తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. అన్ని విభాగాల అధిపతుల దగ్గర నుంచి మంత్రి హరీశ్ రావు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అడిగి తెలుసుకుంటున్నాను. వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి, వైద్య సేవల్లో అంతరాయం లేకుండా చూస్తున్నామని ఆయన వెల్లడించారు.
టీచింగ్ ఆసుపత్రుల్లో 190 అసిస్టంట్ ప్రొఫెసర్ పోస్టులను అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతులు కల్పించే ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలి అని మంత్రి హరీశ్ రావు తెలిపారు. కౌన్సిలింగ్ పూర్తి చేసి వెంటనే పోస్టింగ్ లు ఇవ్వాలి అని ఆయన పేర్కొన్నారు. ప్రొఫెసర్ నుంచి అడిషనల్ డీఎంఈగా పదోన్నతి పొందేందుకు వీలుగా వయోపరిమితి 57 ఏళ్ల నుంచి 64 ఏళ్లకు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నాడు.
Harish Rao: ప్రభుత్వ వైద్య సేవలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉందని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. పెరిగిన డిస్పెన్సరీల ప్రకారం అత్యంత పారదర్శకంగా నియామకాలు జరుగుతున్నాయని వెల్లడించారు.
దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దేశంలో రోజువారీ కోవిడ్ -19 కేసుల సంఖ్య మరోసారి భారీగా పెరిగింది. గత 24 గంటల్లో 9,629 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. గత 24 గంటల్లో 29 మరణాలతో మరణాలు సంభవించాయి.