Minister Satya Kumar Yadav: పనివేళలు పాటించని వైద్య సిబ్బందిపై మంత్రి ఆగ్రహం.. ఇక, ఆటోమేటిక్‌గా షోకాజ్ నోటీసులు..!
- వైద్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సత్యకుమార్ సమీక్ష..
- వైద్య సిబ్బంది పనివేళలు పాటించకపోవడంపై ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Satya Kumar Yadav: వైద్య సిబ్బంది పనివేళలు పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ వైద్యులు, ఇతర సిబ్బంది నిర్ణీత పనివేళలు పాటించకపోవడంపై మండిపడ్డారు.. ఈ విషయంపై గురువారం సాయంత్రం మూడు గంటలకు పైగా మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులతో లోతుగా సమీక్షించారు. పనివేళల పట్ల నెలకొన్న క్రమశిక్షణా రాహిత్యం, దానిని అరికట్టేందుకు ప్రస్తుతం వివిధ స్థాయిల్లో చేపడుతున్న చర్యలు, పరిస్థితిని మెరుగుపర్చేందుకు మున్ముందు చేపట్టాల్సిన చర్యల గురించి వివరంగా చర్చించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, వివిధ శాఖాధిపతులు సమీక్షలో పాల్గొన్నారు. ఎక్కువ మంది క్రమశిక్షణ పాటిస్తున్నా.. కొంత మంది సిబ్బంది పనివేళలను ఉల్లంఘిస్తుండడంతో ప్రజారోగ్య వ్యవస్థకు చెడ్డ పేరు వస్తోందని మంత్రి అన్నారు.
Read Also: Isreal- Gaza Conflict: గాజాపై మరోసారి ఇజ్రాయెల్ దాడి.. 27 మంది మృతి
Also Read
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
- CRDA: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్..! గ్రామకంఠం మినహాయింపులపై CRDA క్లారిటీ..
- Viveka Murder Case: వివేకా కేసులో సునీల్ యాదవ్ సంచలన వాంగ్మూలం..!
వైద్యులు, ఇతర సిబ్బంది ఆలస్యంగా విధులకు రావడం, నిర్ణీత సమయానికంటే ముందే నిష్క్రమించడంపై ప్రసార మాధ్యమాల్లో తరచుగా వస్తున్న వార్తలు తనను ఆవేదనకు గురిచేస్తున్నాయన్నారు మంత్రి సత్యకుమార్.. వివిధ సమస్యలతో ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగులకు వైద్యులు అందుబాటులో లేకపోతే వారెంతో ఇబ్బందులకు గురవుతారని, కనుక అందరూ పనివేళలను పాటించేలా తగు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి అత్యున్నత ప్రభుత్వ సర్వ జన ఆసుపత్రులు వరకు వైద్యులు, సహాయక సిబ్బంది హాజరుపై పర్యవేక్షణ జరుగుతున్న తీరును చర్చించి ప్రస్తుత వ్యవస్థలో లోపాల్ని గమనించారు. హాజరును దినవారీగా పరిశీలించి నిర్ణీత వేళల మేరకు విధులకు హాజరు కాని సిబ్బందిపై పటిష్టమైన పర్యవేక్షణ లేకపోతే ప్రభుత్వాసుపత్రులకు వచ్చే లక్షలాది ప్రజలకు తీవ్ర అన్యాయం చేసినవారమవుతామని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆందోళ వెలిబుచ్చారు.
Read Also: Triptii Dimri : యానిమల్ రిలీజయ్యాక మూడు రోజులు ఏడ్చా.. భాభీ 2 షాకింగ్ కామెంట్స్
ఇక, క్రమశిక్షణ తప్పితే తగు కఠిన చర్యలు తీసుకోబడతాయన్న ఆలోచన, భయం సిబ్బందిలో లేకపోతే పరిస్థితిలో మార్పు రాదని మంత్రి అన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో హాజరు విషయంలో నిత్య పర్యవేక్షణ చేయడం కోసం ఆ బాధ్యతను మంత్రి సత్యకుమార్ యాదవ్ మంత్రిత్య శాఖలోని వివిధ శాఖాధిపతులకు అప్పగించి, వీలైనంత త్వరలో మార్పు తెచ్చేందుకు తగు చర్యల్ని చేపట్టాలని ఆదేశించారు. ఎఫ్ఆర్ఎస్ విధానంలో వైద్య సిబ్బంది తమ హాజరును నమోదు చేయడానికి రూపొందించబడిన యాప్‌ను మంత్రి నిశితంగా పరిశీలించారు. ఈ యాప్ యొక్క ప్రయోజనాన్ని, దాన్ని పర్యవేక్షణ కోసం వాడుకుంటున్న తీరుపై మంత్రి పలు ప్రశ్నలు అడిగారు. ఈ యాప్ ద్వారా సెప్టెంబర్ నెలలో నమోదైన హాజరును మంత్రి పరిశీలించారు. ఉన్నతాధికారుల స్థాయిలో సమర్ధవంతమైన పర్యవేక్షణకు అవసరమైన కొన్ని మార్పుల్ని ఆయన సూచించారు. మూడు రోజుల పాటు నిర్ణీత వేళల మేరకు విధులు నిర్వహించకపోయినా, అనుమతి లేకుండా గైరు హాజరైనా ఒక రోజు జీతం కోత విధిస్తున్నామని అధికారులు మంత్రికి వివరించారు. ఈ యాప్‌ను మరింత మెరుగుపర్చి పనివేళల్ని ఉల్లంఘించే సిబ్బందికి ఆ మేరకు సమాచారంతో పాటు ఆటోమేటిక్ గా షోకాజ్ జారీ చేసే విధంగా యాప్‌లో మార్పులు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు..
తాజావార్తలు
-
IND vs WI 1st ODI: నేడు భారత్, వెస్టిండీస్ మొదటి వన్డే.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ డీటెయిల్స్ ఇవే!
-
BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
-
Hyderabad: “కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు”.. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
-
Siva Karthikeyan : స్టార్ హీరోలు వదిలేసిన కథలతో శివకార్తీకేయన్ ప్రయోగాలు
-
KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?