మంత్రి మల్లారెడ్డి ఇంటికి ఆర్ఎంపీ, పీఎంపీలు భారీగా చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌ఎంపి, పీఎంపిల పై వైద్య ఆరోగ్య శాఖ దాడులు చేస్తుందంటూ ఆర్ఎంపీ లు, పీఎంపీలు మంత్రి ఇంటికి తరలి వచ్చారు.
Family doctor implements from august 15th in andhra pradesh: ఏపీలో వచ్చేనెల 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజినీ వెల్లడించారు. మంగళగిరిలో సోమవారం నాడు వైద్య ఆరోగ్యశాఖపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాలకు వెళ్లే వైద్యుల వద్ద ప్రతి రోగి ఆరోగ్య కార్డు ఉంటుందన్నారు. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్, పీహెచ్‌సీలకు అనుబంధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలవుతుందని మంత్రి…
తమ ప్రభుత్వం అమలుచేస్తున్న ‘కేసీఆర్ కిట్’ పథకం సూపర్ డూపర్ హిట్ అయిందని సీఎం కేసీఆర్ పలుమార్లు పేర్కొన్నారు. 2017లో ప్రారంభమైన ఈ స్కీమ్‌లో భాగంగా 2022 ఫిబ్రవరి నాటికి 10 లక్షలకు పైగా కిట్లను అందజేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కిట్‌లో మరిన్ని ఐటమ్స్ ఇవ్వాలని సర్కారు భావిస్తోంది. ఈ మేరకు ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం అయిన మహిళకు, పుట్టిన బిడ్డకు ఈ కేసీఆర్ కిట్‌ను అందజేస్తున్నారు. కేసీఆర్ కిట్‌తోపాటు…
మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి… రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ మంట పుట్టిస్తున్నాయి… ఓవైపు ఎండల తీవ్రత.. మరోవైపు వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. దీంతో ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక సూచనలు చేసింది.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిందని వెల్లడించారు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు. ఆ జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్‌లో 40…
వైద్యారోగ్య శాఖలో ఉద్యోగుల బదిలీల గడువును పొడిగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… ఉద్యోగుల బదిలీల గడువును మార్చి 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. ఉద్యోగులు ఫిబ్రవరి 25 తేదీ నుంచి మార్చి 3 తేదీ వరకు ఆన్‌లైన్‌లో బదిలీ అప్షన్లు ఇవ్వొచ్చని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ప్రభుత్వం… ఇక, మార్చి 4 నుంచి 8 తేదీ వరకు సంబంధిత హెచ్‌వోడీల నేతృత్వంలో కౌన్సిలింగ్ జరుగుతుందని తన ఉత్తర్వుల్లో వైద్యారోగ్య శాఖ పేర్కొంది.. బదిలీ ప్రక్రియను…
రాష్ట్రంలో కొనసాగుతున్న ఫీవర్ సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కరోనా లక్షణాలు లేని ఇళ్లు లేవంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఇంట్లో కోవిడ్ లక్షణాల బారిన పడుతున్నారు జనాలు. ఫీవర్ సర్వే ప్రారంభం అయిన 9 రోజుల్లోనే 4,00,283 మంది కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఈనెల 21 నుంచి 29 వరకు నిర్వహించిన ఫీవర్ సర్వే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవల ద్వారా స్పష్టమైంది. అయితే కోవిడ్ వ్యాధిపై అవగాహన…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మహమ్మారి కేసులు.. ఇవాళ మరోసారి కాస్త పెరిగాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లెక్కల ప్రకారం… ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 14,502 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,95, 136 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 7 గురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య…
రాష్ట్రంలో కొత్తగా 20 బ్లడ్ స్టోరేజీ సెంటర్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా, జ్వర సర్వే, వాక్సినేషన్ అంశాలపై సోమవారం వైద్యారోగ్య అధికారులతో మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కరోనా కట్టడి కోసం మొదలు పెట్టిన ఫీవర్ సర్వే రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతుందన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఒకవైపు కొత్త ఆసుపత్రులు, కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు తో పాటు,…
ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. మొన్నటి వరకు తగ్గిన కరోనా కేసులు.. ఈ మధ్య కాలంలో భారీగా పెరిగి పోతున్నాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 14,440 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,80, 634 కి పెరిగింది.ఒక్క రోజు వ్యవధిలో మరో…