Harish Rao : తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ), బస్తీ దవాఖానల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యాలపై ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటతాయి కానీ చేతలు మాత్రం గడప దాటవు అని ఆయన హెద్దెవ చేశారు. ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామంటూ ప్రచారం చేసుకోవడం తప్ప, ఆచరణలో మాత్రం…
సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటించారు. తెలంగాణలోని 34 జిల్లాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లను వర్చువల్ గా ప్రారంభించారు. వైద్యారోగ్య శాఖ- EFLU మధ్య కీలక ఒప్పందం కుదిరింది. విదేశాల్లో ఉద్యోగం కోసం జర్మన్, జపాన్ లాంగ్వేజ్ లలో నర్సింగ్ విద్యార్థులకు రెండేళ్ల శిక్షణ ఇవ్వనున్న ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజిస్ యూనివర్సిటీ.. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి క్యాన్సర్ పై…
తెలంగాణలో ఆరోగ్యశాఖలో మరోసారి ఉద్యోగాల వేట మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం భారీగా స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1623 పోస్టులు భర్తీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. వివరాల ప్రకారం, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని హాస్పిటల్స్‌లో
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో రేపటి నుండి క్యాన్సర్ కేసుల అంశంపై మరోసారి సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. క్యాన్సర్ కేసులు విషయంలో అధికారుల లెక్క, వాస్తవ పరిస్థితులకు భిన్నమైన వాదన ఉన్న నేపథ్యంలో గ్రామంలో మరోసారి సమగ్ర సర్వే చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి ఇంటింటి సర్వే నిర్వహించి రొమ్ము, గర్భాశయ, ముఖద్వారం, ఓరల్ క్యాన్సర్ ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో జిల్లా వైద్యాధికారులు చర్చించి…
Harish Rao : హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద సమస్యల పరిష్కారం కోసం ఆర్ఎంపీ, పీఎంపీల మహా ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు భారీగా ఆర్ఎంపీ, పీఎంపీలు తరలివచ్చారు. అయితే.. వారి ధర్నాకు మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఆర్ఎంపీ, పీఎంపీలపై బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి కేసులు లేవని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో భయబ్రాంతులకు గురిచేసి , అక్రమ కేసులు పెడుతున్నారని, మేనిఫెస్టోలో…
Kidney racket: హైదరాబాద్ లోని కిడ్నీ రాకెట్ కుంభకోణంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోనుంది. సరూర్‌నగర్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ పై ప్రభుత్వం నిజానిర్దారణ కమిటీ వేసింది. ఇక అలకనంద ఆస్పత్రిలో జరిగిన కిడ్నీ రాకెట్ కేసు తీవ్రత మారనుంది. ఈ కేసులో విచారణ వేగవంతం చేయడానికి ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసును సీఐడీకి బదిలీ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. Also Read:…
చైనాలో గుర్తించిన మరో కొత్త వైరస్ హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటా న్యూమో వైరస్) కి సంబంధించిన కేసులు రాష్ట్రంలో ఎక్కడా లేవని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డా. పద్మావతి తెలిపారు. ఈ వైరస్ కారణంగా ప్రజలెవరూ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
మంత్రి దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ.. ఆయుర్వేదం, యోగా మన వేద జ్ఞానం అని, ప్రకృతితో మమేకమై ఎలా జీవించాలో పూర్వీకులు మనకు నేర్పించారన్నారు. మనం దాన్ని కొనసాగించ లేకపోతున్నామని, యోగా, ఆయుర్వేదం మతానికి సంబంధించిన అంశాలు కాదన్నారు మంత్రి దామోదర.
వైద్య సిబ్బంది పనివేళలు పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ వైద్యులు, ఇతర సిబ్బంది నిర్ణీత పనివేళలు పాటించకపోవడంపై మండిపడ్డారు.. ఈ విషయంపై గురువారం సాయంత్రం మూడు గంటలకు పైగా మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులతో లోతుగా సమీక్షించారు. పనివేళల పట్ల నెలకొన్న క్రమశిక్షణా రాహిత్యం, దానిని అరికట్టేందుకు ప్రస్తుతం వివిధ స్థాయిల్లో చేపడుతున్న చర్యలు, పరిస్థితిని మెరుగుపర్చేందుకు మున్ముందు చేపట్టాల్సిన చర్యల గురించి వివరంగా చర్చించారు.