Damodar Raja Narsimha: సీజనల్ వ్యాధుల కట్టడిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అన్ని చర్యలు చేపట్టిందని మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. సీజనల్ వ్యాధులు (డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా ) కట్టడిలో భాగంగా రాష్ట్రంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ స్థాయి నుంచి అన్ని ఏరియా ఆసుపత్రుల వరకు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల వరకు అన్ని స్థాయి ఆస్పత్రులలో డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, డయాగ్నస్టిక్ సిబ్బంది, అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయన్నారు.
Read Also: AP and Telangana Rains LIVE UPDATES: వరుణుడి ప్రతాపం.. రేపు ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
రాష్ట్రవ్యాప్తంగా వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సిబ్బంది సీజనల్ వ్యాధుల కట్టడిలో భాగంగా ఇంటింటా జ్వర సర్వే నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1 కోటి 63 లక్షల 73 వేల 729 ఇళ్లలో జ్వర సర్వే నిర్వహించడం జరిగిందన్నారు. జ్వర సర్వేలో భాగంగా 5 కోట్ల 3 లక్షల 5వేల 231 మంది రక్త నమూనాలను పరీక్షించినట్లు మంత్రి తెలిపారు. జ్వర సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 2,93,371 మంది సీజనల్ వ్యాధుల బారిన పడిన బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందించడం జరిగిందన్నారు. రాజకీయాల కోసం సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయటం మానుకోవాలన్నారు. గత 10 సంవత్సరాలలో సీజనల్ వ్యాధుల బారిన పడిన బాధితుల వివరాలను పరిశీలించిన అనంతరం ట్విట్టర్‌లో కామెంట్లు చేస్తే మంచిదని మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు.