నేడు కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ లతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. “అమైకస్ క్యూరీ” గా పరమేశ్వరన్ వ్యవహరించారు. విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ తెలంగాణ ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇష్టానుసారంగా డజన్ల కొద్ది బుల్డోజర్లు చెట్లను తొలగించేందుకు ఉపయోగించారని మండిపడ్డారు. ఇదంతా ముందస్తు పథకం…
కేటీఆర్‌పై ఫైర్ అయ్యారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె.. కేటీఆర్ కి దమ్ముంటే ఆ ఎంపీ పేరు చెప్పాలి కదా? అని సవాల్ చేశారు.. ఎవరి గురించి మాట్లాడాడో చెప్పకుండా... ఒక ఎంపీ అని గాలివార్త చెప్తే సరిపోదు కదా..? అని నిలదీశారు..
తెలుగు రాష్ట్రాల్లో…ఆ భూముల వ్యవహారంపై రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. పార్టీల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు గత చరిత్రను తవ్వుకుంటున్నారు. ఈ భూముల వ్యవహారంలో బీజేపీ నేత ఉన్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే…ఆ ఎంపీ ఎవరో చెప్పాలని కాషాయ నేతలు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలిలోని సెంట్రల్ వర్సిటీ భూముల రచ్చరచ్చ అవుతోంది. 400 ఎకరాల భూమి హెచ్‌సీయూకా? ప్రభుత్వానిదా? అనే వివాదం కొనసాగుతూనే ఉంది. 400 ఎకరాల స్కాం వెనుక బీజేపీ ఎంపీ…
మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జ్యోతిరావు పూలేకు నివాళులు అర్పిస్తూ.. 1022 గురుకుల పాఠశాలలు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. “కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచ్చలవిడిగా విధ్వంసం చేస్తున్నారు.. ప్రజల దృష్టి మరల్చి కుంభకోణానికి పాల్పడుతున్నారు..hcu భూముల విషయంలో అతి పెద్ద కుట్ర జరిగింది.. దీని వెనకాల 10 వేల ఎకరాల స్కాంకు తెరలేపారు.. రేవంత్ ప్రభుత్వం ఆర్ధిక నేరానికి పాల్పడుతోంది.. ఇది…
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో Hcu టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ గ్రూప్స్ తో సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి చర్చల తదుపరి డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కేసుల…
పీసీసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. “కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ది అమిత్ షాకు చెప్పులు తొడిగిన చరిత్ర.. 11ఏండ్లు తెలంగాణకు ఏమి తెచ్చారో కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు వైట్ పేపర్ రిలీజ్ చేయండి.. చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. మోడీ, అమిత్ షాలు ఆర్డర్ వేస్తేనే కిషన్ రెడ్డి, బండి…
కంచ గచ్చిబౌలి భూములపై డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుల సంయుక్త ప్రకటన చేశారు. కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలను పాటిస్తామని తెలిపారు. సర్వోన్నత న్యాయస్థానం కోరిన సమాచారాన్ని గడువులోపు పంపిస్తామని వెల్లడించారు. సుప్రీంకోర్టుపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉందని.. న్యాయం గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులపై కఠినంగా వ్యవహరించవద్దని అదనపు డీజీ (ఇంటెలిజెన్స్), సైబరాబాద్ కమిషనర్లను మంత్రులు ఆదేశించారు. Also Read:Ambati Rambabu: లోకేష్..…
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ విద్యార్థిలోకం గర్జిస్తోంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్నాయి. పారిశ్రామిక అభివృద్ధి కోసం చెట్లను నరికేసి భూములను వేలం వేయడాన్ని పర్యావరణవేత్తలు ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంచ గచ్చిబౌలి HCU భూముల విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. Hcu.. కంచ గచ్చిబౌలి స్థలాల్లో ఎలాంటి పనులు చేయొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. Also Read:Hyderabad: అమీన్ పూర్ పిల్లల…
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని సర్వే నంబరు 25లో 400 ఎకరాల భూములపై వివాదం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. భూములు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి (హెచ్‌సీయూకి) చెందినవే అని, వాటిని వేలం వేయొద్దంటూ విద్యార్థులు మంగళవారం ఆందోళన చేశారు. ఈ వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. భూముల వివాదంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మూడేళ్లలో మరలా అధికారంలోకి వస్తామని, ఆ 400 ఎకరాలు తిరిగి రిటర్న్…
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల వివాదం రోజు రోజుకి తీవ్రంగా మారుతుంది. 400 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ ఏరియా గా డెవలప్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించి.. పచ్చని చెట్లతో ఉండే ఆ ప్రాంతంలో జేసీబీలు రంగంలోకి దింపి విధ్వంసం మొదలు పెట్టారు. దీంతో ఓవైపు విద్యార్థులు తమ యూనివర్సిటీ భూమిని అన్యాక్రాంతం చేయొద్దంటూ నిరసనలు చేస్తున్నారు. మరోవైపు జంతువులు, పర్యావరణానికి ప్రమాదం తేవద్దంటూ సెలబ్రెటీలు ఫైర్ అవుతున్నారు. ఇలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోని…