నేడు కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ లతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. “అమైకస్ క్యూరీ” గా పరమేశ్వరన్ వ్యవహరించారు. విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ తెలంగాణ ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇష్టానుసారంగా డజన్ల కొద్ది బుల్డోజర్లు చెట్లను తొలగించేందుకు ఉపయోగించారని మండిపడ్డారు. ఇదంతా ముందస్తు పథకం ప్రకారమే చేసినట్లుగా ఉందన్నారు. పర్యావరణాన్ని పునరుద్దరించకపోతే జైలుకు వెళ్లాల్సిందేనని సుప్రీం కోర్టు హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత అధికారులను ధర్మాసనం హెచ్చరించింది. తదుపరి విచారణ జూలై 23కు వాయిదా వేసింది.
Also Read:Mamitha : భారీగానే డిమాండ్ చేస్తున్న ప్రేమలు బ్యూటీ.. !
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ విద్యార్థిలోకం నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పారిశ్రామిక అభివృద్ధి కోసం చెట్లను నరికేసి భూములను వేలం వేయడాన్ని పర్యావరణవేత్తలు ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంచ గచ్చిబౌలి HCU భూముల విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Also Read:Vallabhaneni Vamsi: అస్వస్థతకు గురైన వల్లభనేని వంశీ.. ఆసుపత్రికి తరలించిన పోలీసులు
గత విచారణ సందర్భంగా నాలుగు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. పర్యావరణం, వన్యప్రాణుల రక్షణకు తీసుకునే చర్యలను పేర్కొంటూ అపిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటివరకు యధాతధ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. ఈలోగా ఒక్క చెట్టు కూడా నరకడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుమారు వంద ఎకరాల్లో ధ్వంసమైన పర్యావరణాన్ని ఎలా పునరుద్ధరణ చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. కంచ గచ్చిబౌలి భూముల గురించి సుప్రీంకోర్టుకు నివేదిక అందజేసిన “సీఈసీ” కేంద్ర సాధికారిక కమిటీ.