పీసీసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. “కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ది అమిత్ షాకు చెప్పులు తొడిగిన చరిత్ర.. 11ఏండ్లు తెలంగాణకు ఏమి తెచ్చారో కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు వైట్ పేపర్ రిలీజ్ చేయండి.. చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. మోడీ, అమిత్ షాలు ఆర్డర్ వేస్తేనే కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు పని చేస్తారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 20వేల ఎకరాల ప్రభుత్వ భూములు కరిగి పోతే కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు.
Also Read:Petrol price hike: సామాన్యుడికి షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..
10వేల భూములను కేసీఆర్, కేటిఆర్ లు అమ్ముకుంటే కిషన్ రెడ్డి ఏమి చేస్తుండు. కిషన్ రెడ్డి ఒక్క చాన్స్ కావాలని ప్రాధేయపడుతుండు.. తెలంగాణకు ఏమి ఎలగబెట్టారని ఒక్క చాన్స్ అని అడుగుతున్నారు.. మూడు సార్లు మోడీని ప్రధానిని చేస్తే రాష్ట్రానికి ఏమి ఎలగబెట్టారు.. తెలంగాణ ప్రజలు కిషన్ రెడ్డికి ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా అవకాశం ఇస్తే ఏమి చేశారు. మూడో సారి కూడా మతం పేరున ఓట్లు అడిగి అధికారంలోకి వచ్చారు.. మెట్రో కోసం ఒక్క రూపాయి తెచ్చిన పాపాన పోలేదు..
Also Read:Paritala Sunitha: జగన్ పర్యటనపై పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు.. హెలికాప్టర్ దిగకుండానే..!
మూసి ప్రక్షాళన జరిగి హైదరాబాద్ ప్రజలు సుకపడటం కిషన్ రెడ్డికి నచ్చదు.. మతతత్వ రాజకీయాలు తెలంగాణ ప్రజలకు నచ్చదు.. అందుకే మీకు ప్రజలు చాన్స్ ఇవ్వరు.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కల్లా.. విభజన హామీలు కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కి పట్టదు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు పగటి కలలు కంటున్నారు.. కేంద్రం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్న కూడా పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పని చేస్తోంది.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కలలు కనడం మానండి..
Also Read:AAI Recruitment 2025: డిగ్రీ అర్హతతో.. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్..
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఒక కళ.. రాష్టం ఆర్థిక విధ్వంసం అయినా.. ఎన్ని కష్టాలు వచ్చిన.. కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపించినా ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నం.. పేద వాళ్లకు సన్న బియ్యం ఇస్తున్నం.. ఇప్పుడు Hcu గురించి మాట్లాడే బీజేపీ నాయకులు.. ఆనాడు లక్షల ఎకరాలు గత ప్రభుత్వం డి ఫారెస్ట్ చేస్తే.. కిషన్ రెడ్డి ఆనాడు ఎందుకు నోరు మేదపలేదు.. మీరు.. మీ బీజేపీ తెలంగాణాకీ ఏం చేసిందో… వైట్ పేపర్ రిలీజ్ చేయాలి.. ఏఐసీసీ నడుపుతుంది అని మాట్లాడుతున్నారు.. అమిత్షా, మోదీ పర్మిషన్ లేనిదే బ్రేక్ ఫాస్ట్ కూడా చేయరు.. అమిత్ షా మోదీ చెప్పులు మోయలేదా.. సన్నబియ్యం మేమే ఇస్తున్నాం అని బీజేపీ నాయకులు చెప్తున్నారు.. సన్న బియ్యం కార్యక్రమం బీజేపీ పాలిత అన్నీ రాష్టాలలో అమలు చేయండి.. బీజేపీకి వితండవాదం అలవాటైందని” మహేష్ కుమార్ గౌడ్ విరుచుకుపడ్డారు.