రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై యాజమాన్యం తనదేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం.. 2004లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రైవేటు సంస్థకు ఈ భూమిని కేటాయించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోని కేసుల్లో చట్టపరంగా గెలవడం ద్వారా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూమిపై యాజమాన్యాన్ని దక్కించుకుంది. ఆ భూమికి సంబంధించి సృష్టించే ఎటువంటి వివాదమైనా…
KTR : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ట్విట్టర్ వార్ మొదలైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శిస్తూ ట్విట్టర్ వేదికగా ఓ కీలక వ్యాఖ్య చేశారు. “తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ అవివేకపూరిత నిర్ణయం వల్ల హైదరాబాద్ నగరం ఒక పెద్ద హరిత ప్రాంతాన్ని కోల్పోనుంది. కంచే-గచ్చిబౌళిలో 400 ఎకరాల భూమిని అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాను,” అని కేటీఆర్…
HCU : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో (HCU) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ భవనం అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. భవనం నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో, అక్కడే పనిచేస్తున్న కార్మికులు తీవ్ర ప్రమాదంలో చిక్కుకున్నారు. అదనపు మట్టిశ్రమకు లోనైన కార్మికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. భవనం కూలిపోవడం గమనించిన తోటి కార్మికులు, యూనివర్సిటీ సిబ్బంది హుటాహుటిన స్పందించి శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే…
ఎన్ఎస్యూఐ అధ్వర్యంలో నిర్వహిస్తున్న పుట్ బాల్ టోర్నమెంట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అందులో భాగంగానే నేటి (ఆదివారం) ఉదయం 9. 30గంటలకే సీఎం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటికి చేరుకున్నారు.
BBC documentary on modi: ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జెఎన్‌యూ) మరోసారి వార్తల్లో నిలిచింది. యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ని ప్రదర్శించడంపై విద్యార్థి సంఘాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఈ డాక్యుమెంటరీపై నిషేధం విధించినా.. పట్టించుకోకుండా లెఫ్ట్ విద్యార్థి సంఘం (ఎస్ఎఫ్ఐ) డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు సిద్ధం అయింది.
Hyderabad Central University: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో కలకలం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ను ప్రదర్శించడం వివాదాస్పదం అయింది. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. యూనివర్సిటీలో కొంతమంది ప్రధాని మోదీ డాక్యుమెంటరీని ప్రదర్శించారని క్యాంపస్ అధికారులకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) ఫిర్యాదు చేసింది. దీంతో మరోసారి హెచ్‌సీయూ వార్తల్లో నిలిచింది.
కరోనా మహమ్మారి నుంచి గట్టెక్కాము అనుకున్న చాలామంది కోవిడ్ బాధితులను బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది.. దీంతో, కరోనా బారిన పడినవారు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.. అయినా, క్రమంగా దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కేసులు నమోదు అవుతున్నాయి.. అయితే, బ్లాక్ ఫంగస్ ముప్పు ఎవరిలో ఎక్కువగా ఉంటుందనే విషయంపై ఓ అధ్యయనం నిర్వహించింది హైదరాబాద్ సెంట్రల్…
తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చలిపులి పంజా విసిరింది. తిర్యాని మండలం గిన్నెదరిలో 8.3 గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సిర్పూర్ (యూ) లో 9 డిగ్రీలు నమోదయింది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ గణాంకాల చలి బాగా పెరిగింది. నగరం చలి గుప్పిట్లో చిక్కుకుంది. జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. మూడు రోజులుగా పెరుగుతున్న చలి నగరవాసులన్ని వణికిస్తుంది. మూడు రోజుల క్రితం 19 డిగ్రీల సెల్సియస్‌గా ఉన్న కనిష్ట…
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరో విద్యార్థిని ప్రాణాలు వదిలింది.. పీజీ చేస్తున్న మౌనిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని తనువు చాలింది… హెచ్‌సీయూలోని హాస్టల్ రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది మౌనిక.. ఇక, ఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు… తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగానే మౌనిక్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెబుతున్నారు.. చదువు ఎంత చదివినా నా మనసులోకి ఎక్కడం లేదని సూసైడ్‌లో మౌనిక పేర్కొన్నట్టు తెలియజేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ…