బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం అని ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు మాత్రం మారడం లేదు. ఇంట్లో ఉన్న తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మలు తమ మనుమరాలు, మనువడి పెళ్లి చూసి చనిపోవాలి అని తమ కోరికలను వెలిబుచ్చుతుంటారు. వాళ్ల కోరికలను కాదనలేక పిల్లలకు పెళ్లి చేసేందుకు రెడీ అవుతుంటారు. ఇదే తరహాలో హర్యానాలో ఓ నానమ్మ మునిమనవడిని చూడాలనే కోరకతో తన మనుమరాలికి పెళ్లి చేయాలని చూసింది. కానీ ఆ అమ్మాయి మైనర్ కావడంతో పెళ్లికి బ్రేకులు పడ్డాయి.…
హర్యానాలో దారుణం జరిగింది. ఓ సీఆర్పీఎఫ్ జవాన్‌ను అత్యంత దారుణంగా దుండగులు కాల్చి చంపేశారు. సోనేపట్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Shocking: హర్యానా హిసార్‌లో సంచలన ఘటన జరిగింది. ఒక గ్రామంలో ఇద్దరు మైనర్లు తమ హెయిర్ కట్ చేసుకోలేదని, క్షమశిక్షణ పాటించడం లేదని స్కూల్ ప్రిన్సిపాల్ తిట్టినందుకు ఏకంగా ఆయనను పొడిచి చంపారు. ప్రిన్సిపాల్‌పై కోపంతో ఇద్దరు విద్యార్థులు ఈ హత్యకు పాల్పడినట్లు హన్సి ఎస్పీ అమిత్ యశ్వర్థన్ తెలిపారు.
దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా మార్పు రావడం లేదు. ఎక్కడొక చోట హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హర్యానాలో కోడలిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Controversy Marriage: హర్యానా రాష్ట్రంలోని యమునా నగర్ జిల్లా కేంద్రంగా ఓ వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. 21ఏళ్ల యువకుడు మొహమ్మద్ ఇర్ఫాన్ తన 65 ఏళ్ల అమ్మమ్మ సుల్తానా ఖాటూన్ ను పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలోనూ తీవ్ర కలకలం రేపుతోంది.
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం నుంచి బాధిత కుటుంబాలు తేరుకోలేదు.. దేశ ప్రజలు మరిచిపోలేదు. ఇంకా కళ్ల ముందు ఆ దృశ్యాలే మెదులుతున్నాయి. దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన విమాన ప్రమాదాల్లో ఇదొకటి.
Faridabad: హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలతో కలిసి ఓ మహిళను దారుణంగా చంపేశారు. మురుగు కాల్వ కోసమని గొయ్యి తవ్వి కోడలు శవాన్నీ అందులో పూడ్చి పెట్టేశారు. ఆపై కోడలు ఎవరితోనో లేచిపోయిందని అసత్య ప్రచారం చేసారు.
Pak Spy Jyoti Malhotra: పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు కోర్టులో బిగ్ షాక్ తగిలింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ఆమెకు హర్యానాలోని హిసార్‌లో గల న్యాయస్థానం మరోసారి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చింది.
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ హర్యానా పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతేడాది హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ బోల్తా పడింది. అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేయగా.. తీరా రిజల్ట్ సమయానికి అంచనాలన్నీ తారుమారయ్యాయి.
పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో నిర్వహించాల్సిన మాక్‌డ్రిల్ మే 31కి వాయిదా పడింది. పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్, హర్యానా, రాజస్థాన్‌లో మే 29న భద్రతా విన్యాసాలు చేయాలని కేంద్రం ఆదేశించింది.