ఈ రోజుల్లో కూడా మూడ నమ్మకాలతో, బూత వైద్యులతో జనాలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. జనాలు మూడ నమ్మకాలను నమ్మి కొన్నిసార్లు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటన తాజాగా హర్యానాలో చోటుచేసుకుంది. హిసార్ జిల్లాలోని ఉమ్రా గ్రామంలో నిద్రిస్తున్న ఒక యువకుడిని పాము కాటు వేసింది. అతడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లకుండా.. బూత వైద్యునికి దగ్గరికి తీసుకెళ్లడంతో యువకుడు చనిపోయాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. భివానీ రోడ్డులోని ఖండా ఖేడి గ్రామానికి చెందిన 35 ఏళ్ల కపిల్.. హిసార్‌లోని ఉమ్రా గ్రామంలోని ఇటుక బట్టీలో పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి ఇటుక బట్టీలో తన స్నేహితుడితో కలిసి పడుకున్నాడు. ఉదయం కపిల్ చెవి దగ్గర ఓ పాము కాటు వేసింది. నొప్పిగా ఉండడంతో అతడు మేల్కొని చూసేసరికి అతడి దగ్గర నుంచి ఓ నల్ల పాము వెళ్లడం గమనించారు. కపిల్ తన స్నేహితుడిని నిద్రలేపి కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి వాహనం కావాలని అడిగాడు. అనంతరం కపిల్ తన గ్రామానికి చేరుకున్నాడు.
Also Read: CM Chandrababu: వినాయకుడు అంటే తమషా కాదు.. వడ్డీతో సహా వసూలు చేస్తాడు!
కపిల్ కుటుంబ సభ్యులు అతడిని గ్రామంలో గోరి ఆలయానికి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న బూత వైద్యుడితో చికిత్స అందించారు. అయినప్పటికి ఎలాంటి ఉపశమనం లేదు. ఏడు గంటల తర్వాత యువకుడిని చికిత్స కోసం జింద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కపిల్ సృహ కోల్పోయాడు. ఆసుపత్రికి వైద్యులు చెక్ చేయగా.. అప్పటికే అతను చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇప్పటికైనా ప్రజలు ఇలాంటి బూత వైద్యులను, మూడ నమ్మకాలను కాకుండా.. డాక్టర్లను సంప్రందించాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు.