హర్యానాలో దారుణం జరిగింది. ఓ సీఆర్పీఎఫ్ జవాన్‌ను అత్యంత దారుణంగా దుండగులు కాల్చి చంపేశారు. సోనేపట్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Trump: లండన్ మేయర్ దుష్టుడు.. బ్రిటన్ ప్రధాని పక్కన ఉండగానే ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాన్ కృష్ణ కుమార్(30)కు ఇటీవల కన్వారియాలతో మత సంబంధమైన ఘర్షణ జరిగింది. అయితే దీన్ని మనసులో పెట్టుకున్న ముగ్గురు దుండగులు జవాన్ ఇంటికి వచ్చారు. బయటకు పిలిచి అతి సమీపంలోంచి కాల్చివేసేశారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Karnataka: ఓ అక్క మరణశాసనం.. వ్యాధి బయటకు తెలియకూడదని తమ్ముడు హత్య
కృష్ణ కుమార్ ఇటీవలే ఛత్తీస్‌గఢ్ నుంచి తన స్వస్థలానికి తిరిగి వచ్చాడు. జూలై 25న ఖాన్‌పూర్ కలాన్‌లోని భగత్ ఫూల్ సింగ్ మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో భార్య కుమారుడికి జన్మనిచ్చింది. భార్యను, బిడ్డను చూసేందుకు హర్యానా వచ్చాడు. అయితే ఆదివారం-సోమవారం అర్ధరాత్రి సమయంలో దమ్కాన్ గ్రామంలోని కృష్ణకుమార్ ఇంటికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. బయటకు రావాలని పిలిచారు. వెంటనే అతనిపై కాల్పులకు తెగబడ్డారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించినట్లు సోనెపట్ పోలీసు ప్రతినిధి రవీందర్ సింగ్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Nimisha Priya: కేరళ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దులో ట్విస్ట్..
ఇటీవల కన్వారియాలతో జరిగిన ఘర్షణ కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులంతా సొంత గ్రామస్థులేనని.. అంతేకాకుండా వారంతా కన్వారియాలేనని పోలీసులు పేర్కొన్నారు. నిందితులు నిషాంత్, ఆనంద్, అజయ్‌లుగా గుర్తించారు. హరిద్వార్ తీర్థయాత్ర చేస్తున్న సమయంలో జవాన్ కృష్ణకుమార్‌కు నిందితుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దాన్ని మనసులో పెట్టుకుని నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా వెల్లడించారు. హత్య కేసు కింద కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.