దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా మార్పు రావడం లేదు. ఎక్కడొక చోట హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హర్యానాలో కోడలిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: KL Rahul: దేశానికే తొలి ప్రాధాన్యం.. కేఎల్ రాహుల్ సూపర్!
ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లా షికోహాబాద్‌కు చెందిన మహిళ (24).. హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన యువకుడితో 2023, జూలైలో వివాహం జరిగింది. అయితే పెళ్లైన దగ్గర నుంచి కట్న వేధింపులు మొదలయ్యాయి. దీంతో పోరు భరించలేక పుట్టింటికి వెళ్లిపోయింది. ఏడాది పాటు అక్కడే ఉంది. మొత్తానికి తిరిగి అత్తారింటికి వచ్చింది. అయితే రెండు నెలలుగా ఆమె ఆచూకీ కనిపించలేదు. తమ కోడలు అదృశ్యమైందంటూ అత్తామామలు చెప్పడంతో ప్రజలంతా అదే నమ్మారు.
ఇది కూడా చదవండి: Tollywood : ప్లాప్ హీరోయిన్ కు పిలిచి మరీ అవకాశాలు
ఇక రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో అత్తమామలను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. ఫదీదాబాద్‌లోని ఇంటి వెలుపల తవ్విన 10 అడుగుల గుంటలో పూడ్చి పెట్టిన మృతదేహాన్ని పోలీసులు పైకి తీశారు. దీంతో స్థానిక ప్రజలతో పాటు పోలీసులు షాక్‌కు గురయ్యారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఏప్రిల్ 14న ఆమెను చంపాలని అత్తమామలు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పథకంలో భాగంగా అత్తగారిని ఉత్తరప్రదేశ్‌లోని ఎటాలో జరిగిన వివాహానికి పంపించారు. ఏప్రిల్ 21న రాత్రి కోడలి, ఆమె సోదరికి మామ ఆహారంలో నిద్రమాత్రలు కలిపాడు. భోజనం తర్వాత ఇద్దరు కూడా వేర్వేరు గద్దుల్లో నిద్రపోయారు. ఇక కోడలు అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు మామ గదిలోకి ప్రవేశించి.. ఆమెపై అత్యాచారం చేసి చంపేశాడు. అనంతరం కొడుకును పిలిచి మృతదేహాన్ని ఇంటి వెలుపల తవ్విన గుంటలో పూడ్చేసి.. దానిపై సిమెంట్ కప్పేశారు. గుంట ఎందుకు తవ్వారని ఇరుగుపొరుగు వారు అడిగితే మురుగు నీళ్లు వెళ్లేందుకు తవ్వినట్లు నమ్మించారు. ఏప్రిల్ 25న తన కోడలు తప్పిపోయిందంటూ మమ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో ఫిర్యాదుదారుడిని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మామ, అత్త, భర్త, వదినను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బాధితురాలి సోదరి మాట్లాడుతూ.. పెళ్లైన దగ్గర నుంచి అత్తమామలు నిరంతరం వేధిస్తూనే ఉన్నారని తెలిపింది. అందుకే వివాహం అయిన కొద్ది రోజులకే పుట్టింటికి వచ్చేసిందని తెలిపింది. సంవత్సరం పాటు పుట్టింట్లోనే ఉందని వెల్లడించింది. నిత్యం వేధిస్తూనే ఉన్నారని వాపోయింది.