Air India: ఓ వైపు అంతులేని విషాదం.. ఇంకోవైపు ఎయిరిండియా ఉద్యోగులు బ్రేక్ డ్యాన్స్‌లు.. వీడియో వైరల్
- సభ్యత మరిచిన ఎయిరిండియా ఉద్యోగులు
- అహ్మదాబాద్ ఘటన మరువక ముందే ఉద్యోగులు డీజే పార్టీ
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం నుంచి బాధిత కుటుంబాలు తేరుకోలేదు.. దేశ ప్రజలు మరిచిపోలేదు. ఇంకా కళ్ల ముందు ఆ దృశ్యాలే మెదులుతున్నాయి. దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన విమాన ప్రమాదాల్లో ఇదొకటి. జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే.. సెకన్లలో సమీపంలోని ఒక హాస్టల్ భవనంపై కూలిపోయింది. ఒక్కరు మినహా విమానంలో ఉన్న 241 మంది చనిపోయారు. హాస్టల్‌లో ఉన్న 35 మంది మెడికోలు కూడా దుర్మరణం చెందారు. ఇంత మంది ఒకేసారి చనిపోవడంతో దేశ ప్రజలంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇంత ఘోర విషాదం నెలకొంటే.. కనీసం మానవత్వం లేకుండా ఎయిరిండియా ఉద్యోగులు సభ్యత మరిచి ప్రవర్తించారు. డీజే పాటలకు మహిళా ఉద్యోగులతో పాటు పురుష ఉద్యోగులు నృత్యాలు చేస్తూ నానా హంగామా సృష్టించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Rashmika: ధనుష్‌పై ఎమోషనల్‌గా పోస్ట్ పెట్టిన నేషనల్ క్రష్..
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
విమానాశ్రయంలో గ్రౌండ్ సేవలు అందించే టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా ఉద్యోగులు జూన్ 20న హర్యానాలోని గురుగ్రామ్‌లో ఒక పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ పార్టీకి AISATS చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అబ్రహం జకారియా, ఎయిర్ ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సంప్రీత్ కోటియన్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ జీఎం హాజరయ్యారు. కార్యనిర్వాహకులు డీజే పార్టీ ఏర్పాటు చేశారు. బాలీవుడ్ పాటలు ప్లే అవుతుండగా ఉద్యోగులంతా బ్రేక్ డ్యాన్స్‌లు చేస్తూ ఎంజాయ్ చేశారు. మహిళా ఉద్యోగులు కూడా రెచ్చిపోయి డ్యాన్స్ చేశారు. మగ ఉద్యోగులతో కలిసి డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Phone Tapping : సిట్ ముందుకు ఈటల రాజేందర్
ఎయిరిండియా ఉద్యోగుల తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులు బాధలో ఉంటే.. ఆప్తులను కోల్పోయి రోదిస్తుంటే కనీసం మానవత్వం లేకుండా గంతులేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యావత్తు దేశం దు:ఖంలో ఉంటే ఇంగిత జ్ఞానం లేకుండా ఇవేమీ డ్యాన్స్‌లు అంటూ నెటిజన్లంతా ఫైరవుతున్నారు.
It has only been a few days since the tragic Ahmedabad plane crash.
Many families have not yet been able to see their loved ones for the last time; several bodies have still not been handed over.
Grief hangs heavy in households, funeral pyres are yet to cool. And at such a… pic.twitter.com/rrlekBNAeD
— Squint Neon (@TheSquind) June 22, 2025
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!