వంశ వృక్షం కొనసాగాలంటే పుత్రుడితోనే సాధ్యమవుతుంది. లేదంటే వారసత్వం ఆగిపోతుంది. అందుకోసమే ప్రతి తల్లిదండ్రులు మగ బిడ్డ కోసం ఎదురుచూస్తుంటారు. అలానే ఓ జంట చాలా ఏళ్లు నిరీక్షించింది. అప్పటికే 10 మంది కుమార్తెలు ఉన్నా కూడా వారసుడి కోసమే ఎదురుచూశారు. మొత్తానికి 19 ఏళ్ల తర్వాత కల సాకారం అయింది. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది.

సంజయ్ కుమార్ (38), భార్య (37) దినసరి కూలీలు. హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాలోని ఒక గ్రామంలో నివాసం ఉంటున్నారు. 19 ఏళ్ల క్రితం 2007లో వీరిద్దరికీ వివాహం అయింది. అయితే దంపతులిద్దరూ మగ బిడ్డ కోసం కలలు కన్నారు. కానీ వరుసగా కుమార్తెలకే జన్మనిచ్చింది. ఇలా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 10 మంది కుమార్తెలు పుట్టారు. అయినా కూడా కుమారుడిపై ఆశ చావలేదు. మరోసారి గర్భం దాల్చింది. ఈసారైనా మగ బిడ్డ పుట్టాలని ప్రార్థించింది. మొత్తానికి ఆమె ఆశ ఫలించింది. జనవరి 3న జిందా జిల్లాలోని ఉచానా పట్టణంలో ఓజాస్ ఆస్పత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చింది. దీంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. సహజ ప్రసవం ద్వారా మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: Russia: వెనిజులాలో ఉద్రిక్తతలు.. యూఎస్ నుంచి చమురు నౌకలను రక్షించడానికి రష్యా జలాంతర్గామి ఎంట్రీ!
కుమారుడు కావాలని కోరిక ఉందని.. కుమార్తెలు కూడా తమ్ముడు కావాలని కోరుకున్నారని అందుకే మగ బిడ్డ కోసం ఎదురు చూసినట్లుగా తండ్రి సంజయ్ కుమార్ తెలిపారు. ఇంత మందిని పెంచడం కష్టం కదా? అని అడిగితే.. తనకు ఉన్న ఆదాయంతోనే బిడ్డలకు మంచి వసతులు అందిస్తానని.. తన పెద్ద కుమార్తె 12వ తరగతి చదువుతోందని చెప్పుకొచ్చాడు. అంతా దేవుని దయ అని.. ప్రస్తుతం ఉన్నదాంట్లో సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. ఇక 19 ఏళ్ల నిరీక్షణ తర్వాత జన్మించిన కుమారుడికి దిల్ఖుష్ (సంతోష హృదయం) అని పేరు పెట్టారు.
పెద్ద కుమార్తె సరీనా 18 సంవత్సరాల వయస్సులో ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. అమృత 11వ తరగతి. సుశీల 7వ తరగతి. కిరణ్ 6వ తరగతి. దివ్య 5వ తరగతి. మన్నత్ 3వ తరగతి. కృతిక 2వ తరగతి. అమ్నిష్ 1వ తరగతి చదువుతున్నారు. తొమ్మిదవ, పదవ కుమార్తెలు లక్ష్మి, వైశాలి చిన్న పిల్లలు. వైశాలి తర్వాత చివరిలో వారసుడు వచ్చాడు.
ఇది కూడా చదవండి: Trump-Venezuela: వెనిజులా చమురుపై ట్రంప్ కీలక ప్రకటన