ఏ స్త్రీ అయినా వ్యక్తిత్వ హనానికి భంగం కలిగితే సహించలేదు. ఎవరైనా హద్దు మీరు ప్రవర్తిస్తే మాత్రం తమ ప్రతాపాన్ని చూపిస్తారు. డ్యాన్సరే కదా? అని ఒక కామాంధుడు హద్దులు దాటి ప్రవర్తించాడు. దీంతో తీవ్ర కోపాద్రిక్తురాలైన ఆమె చెంపచెళ్లు మనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Delhi: ఓ వెడ్డింగ్‌లో సల్మాన్-షారూఖ్ డ్యాన్స్.. వీడియో వైరల్
పెళ్లంటేనే సహజంగా ఒక పండుగలా జరుపుకుంటారు. బంధువులు, అతిథుల కోసం రకరకాలైన ఈవెంట్లు ఏర్పాటు చేస్తుంటారు. హర్యానాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో కూడా మహిళా డ్యాన్సర్లతో రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. స్టేజ్‌పై డ్యాన్సర్లు తమ ఆటాపాటలతో పెళ్లివారిని ఉల్లాసపరుస్తున్నారు. ఇంతలో పెళ్లి కొడుకు మామకు ఏం పాడుబుద్ధి పుట్టిందో.. ఏమో తెలియదు గానీ.. స్టేజ్‌పైకి ఎక్కి మహిళా డ్యాన్సర్ స్తన్యాలపై చేయి వేశాడు. తాకరాని చోట డబ్బులు పెట్టే ప్రయత్నం చేయడంపై డ్యాన్సర్ జీర్ణించుకోలేకపోయింది. అంతే ఒక్కసారిగా కామాంధుడి చెంపచెళ్లు మనిపించింది. దీంతో అతడు కూడా ‘నన్నే కొడతావా?’ అంటూ తిరిగి కొట్టాడు. దీంతో పెళ్లి వేడుక కాస్త రణరంగంగా మారింది. ఇరుపక్షాల బంధువులంతా కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. వరుడి బంధువులు అతి కష్టం మీద ముగ్గురు మహిళా డ్యాన్సర్లు తప్పించారు. ఒకరికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. హర్యానాలోని నుహ్ జిల్లా మేవాట్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడిమో ఇప్పుడు వైరల్ అవుతోంది.