ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) షాక్ ఇచ్చింది. రెండేళ్ల పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడకుండా నిషేధం విధించింది. బ్రూక్ వరుసగా రెండో ఏడాది ఐపీఎల్ నుంచి తప్పుకోవడమే ఇందుకు కారణం. బ్రూక్‌పై నిషేధం ఐపీఎల్ 2025 నుంచే అమల్లోకి వస్తుంది. ఇంగ్లండ్ బ్యాటర్ 2027లో మరలా ఐపీఎల్‌లో ఆడవచ్చు. బీసీసీఐ ఈ విషయాన్ని ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కి తెలియజేసిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మార్చి 22 నుంచి ఆరంభం కానుంది. లీగ్ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. మార్చి 24న ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢీకొట్టనుంది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ACA-VDCA అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఐపీఎల్ 2025 కోసం సిద్దమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్ తగిలింది.…
NZ vs ENG: న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ముగిసిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ 423 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అయితే, తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ గెలవడంతో సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ చివరి టెస్టు మ్యాచ్ టిమ్ సౌతీ కెరీర్‌లో చివరిది. ఈ మ్యాచ్‌లో అతను 2 వికెట్లు తీసి తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్ 423 పరుగుల తేడా…
ICC Test Rankings: ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ హ్యారీ బ్రూక్ బుధవారం ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో బ్యాటింగ్లో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. అతను తన సహచర ఆటగాడు జో రూట్ ను దాటుకొని మొదటి స్థానానికి చేరుకున్నాడు. గత కొంత కాలం నుండి రూట్ మొదటి స్థానంలో ఉన్నాడు. హ్యారీ బ్రూక్ 27 నెలల క్రితం ఇంగ్లాండ్ తరఫున అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత చాలా తక్కువ సమయంలో టెస్టుల్లో నంబర్ వన్ బ్యాట్స్మన్ అయ్యాడు.…
NZ vs Eng: ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్‌ను 323 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ విజయంతో ఇంగ్లాడ్ పలు కీలక రికార్డులు నమోదయ్యాయి. ఈ విజయం న్యూజిలాండ్‌పై టెస్టు క్రికెట్‌లో 323 పరుగుల తేడాతో ఇంగ్లండ్ సాధించిన అతిపెద్ద విజయం. విజయానికి నిర్దేశించిన 583 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 259 పరుగులకే…
Highest Innings Totals in Tests: టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ జట్టు మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడింది. ముల్తాన్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 823/7 వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ ఇలా సంచలన ఇన్నింగ్స్ ఆడడం ఇది మూడోసారి. 1938లో ఆస్ట్రేలియాపై 903/7 స్కోర్ చేసింది. 1930లో వెస్టిండీస్‌పై 849 పరుగులు చేసింది. తాజాగా పాకిస్థాన్‌పై 823/7 వద్ద డిక్లేర్ చేసింది. ఓ టెస్ట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక రన్స్ చేసిన జాబితాలో…
England vs Australia: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ వేదికగా నాలుగో మ్యాచ్ జరుగుతోంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ జోష్ క్యాచ్ పట్టాడు. కాకపోతే అది పూర్తి క్యాచ్ కాకపోవడంతో ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంబరాలు చేసుకున్నారు. అయితే, కొద్ది చర్చ తర్వాత ఇద్దరు…
England vs Australia: 5 వన్డేల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఇంగ్లండ్ ఎట్టకేలకు విజయం సాధించింది. మంగళవారం చెస్టర్ లీ స్ట్రీట్‌లో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్స్ అజేయ సెంచరీతో కంగారూ జట్టును ఓడించింది. వన్డే క్రికెట్‌లో నాలుగేళ్ల తర్వాత ఇంగ్లండ్ ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఇక 2023 వన్డే ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియా, ఈ టోర్నమెంట్ నుండి తన విజయాల పరంపరను ప్రారంభించింది. ఈ మ్యాచ్ తో…
South Africa Beat England in T20 World Cup 2024 Super-8: టీ20 ప్రపంచకప్ 2024లో దక్షిణాఫ్రికా వరుస విజయాలు సాధిస్తోంది. లీగ్ దశను అజేయంగా ముగించిన ప్రొటీస్.. అదే హవాను సూపర్-8లోనూ కొనసాగిస్తోంది. సూపర్-8 తొలి మ్యాచ్‌లో అమెరికాపై గెలిచిన దక్షిణాఫ్రికా.. రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌పై గెలుపొందింది. సెయింట్ లూసియా వేదికగా శుక్రవారం అర్ధరాత్రి ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 7 పరుగుల తేడాతో నెగ్గింది. సూపర్-8లో రెండు వరుస…
Harry Brook missing IND vs IND Test Series: భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్ తగిలింది. కీలకమైన మిడిలార్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు బ్రూక్ దూరమవుతున్నట్లు ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఆదివారం తెలిపింది. బ్రూక్ స్థానంలో డాన్ లారెన్స్‌ను ఈసీబీ ఎంపిక చేసింది. బ్రూక్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో…